పైన పటారం – లోన లోటారం

 

అనుమతి రత్న టెక్నో స్కూల్ పేర

నడిపించేది సిద్ధార్థ విజడం బోర్డ్ తో

విద్యా శాఖ ఉన్నతాధికార్లు స్పందించి విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలి
మెదక్ ప్రాజబలం న్యూస్:-

మెదక్ పట్టణం జంబికుంట విధి 5 వ వార్డులో ఉన్న సిద్దార్థ విస్ డం స్కూల్ నందు రత్న టెక్నో స్కూల్ నడుస్తున్నది, ఓకే దగ్గర ఓకే హెడ్ మిస్ తో రెండు స్కూల్స్ ఎలా నడుపుతున్నారో అర్థం కావడం లేదు. డి.ఈ.వో కి ఫోన్ చేసి తెలిపిన స్పందించటం లేదు, అని పిల్లల తల్లిదండ్రులు తెలిపారు. పదవ తరగతి విద్యార్థులకు ఉదయం 7.30నుండి రాత్రి 9.30వరకు తరగతులు నిర్వహిస్తున్నారు, ప్రభుత్వ నిబంధన ప్రకారం ఉదయం 9 నుండి సాయంత్రం 5వరకు అన్ని సబ్జక్టులు బోదించాలి వ్యాయమ పిరియడ్ (పి.ఈ.టి) కూడా ఉండాలి, కానీ నిబంధనలకు విరుద్దంగా కొన్ని సబ్జక్టులు ఉదయం 9 నుండి సాయంత్రం 5వరకు బొదించకుండ ఉదయం 7.30 నుండి 9వరకు సాయంత్రం 5.30నుండి 9.30వరకు బోదిస్తున్నారు. ఈ తతంగం అంతా జిల్లా ఉన్నతాధికారులకు పిర్యాదు చేసిన స్పందించడం లేదని విమర్శలు ఉన్నాయి. ఎది ఏమైనా విద్యా శాఖ ఉన్నత అధికారులతో విచారణ జరిపి బాధ్యులైన యాజమాన్యం పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking