– గ్రామాల్లో పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి
– ప్రభుత్వం ప్రవేశ పెట్టిన స్వచ్చదనం-పచ్చదనం కార్యక్రమంలో ప్రతీ ఒక్కరూ పాల్గొనాలి.
– గ్రామాల్లో ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎంపిడిఓలకు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జి ప్రణవ్ సూచన.
హుజురాబాద్ ప్రజాబలం ప్రతినిధి ఆగస్టు 11
వర్షాకాలం సందర్భంగా గ్రామాలలో డెంగ్యూ,మలేరియా లాంటి వైరల్ జ్వరాలు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఆ భాధ్యత ఆయా మండలాల ఎంపిడిఓలు తీసుకోవాలని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. జమ్మికుంట, హుజురాబాద్ మున్సిపల్ ప్రాంతాల్లో ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలని కోరారు. ప్రతీ ఒక్కరూ ఇంటి పరిసరాల్లో చెత్త,నీరు నిల్వఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అంతేకాకుండా గ్రామాల్లో పారిశుధ్యంపై ఎంపిడిఓలు ఆయా శాఖల అధికారులతో సమన్వయపరుస్తూ ప్రత్యేక దృష్టి పెట్టాలని, మిషన్ భగీరథ ద్వారా వచ్చే నీటిని, గ్రామాల్లో నీటి సరఫరా చేసే ట్యాంకులను,మినరల్ వాటర్ ప్లాంట్ లను శుభ్రంగా ఉంచుకోవాలనీ ప్రణవ్ సూచించారు.వీలైనంత వరకు ప్రజలకు అవగాహన కల్పించేలా చేయాలనీ కోరారు.వర్షాకాలం ప్రభుత్వం స్వచ్చదనం-పచ్చదనం కార్యక్రమం పట్ల అందరికీ అవగాహనపరచాలని దీన్ని సక్రమంగా అమలు చేస్తే వైరల్ జ్వరాల నుండి తప్పించుకోవచ్చని సూచన చేశారు.