గోల్డ్ అండ్ సిల్వర్ జువెలర్స్ అసోసియేషన్ నూతన ఆఫీస్ బిల్డింగ్ ను ప్రారంభించిన మంత్రి తుమ్మల నాగేశ్వరావు
ఖమ్మం ప్రతినిధి ఆగస్టు 11 (ప్రజాబలం) ఖమ్మం స్థానిక వాసవి నగర్ లో వాసవి గార్డెన్స్ ఎదురుగా ఖమ్మం గోల్డ్ అండ్ సిల్వర్ జువెలర్స్ అసోసియేషన్ వారి నూతన ఆఫీస్ బిల్డింగ్ ను తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది,ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ కార్యక్రమం లో మంత్రివర్యులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మీకు వ్యాపారస్తులకి ఎటువంటి ఇబ్బంది రాకుండా మిమ్మల్ని చక్కగా వ్యాపారం చేసుకోవడానికి స్వేచ్ఛ వాతావరణం కల్పిస్తుంది అని తెలియ చేశారు. అంతే కాకుండా ఖమ్మం పట్టణం అభివృద్ధి మీరు కోరుకున్న రీతిలో చేయడానికి నేను ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మేయర్ పునుకొల్లు నీరజ నగర ఏ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బాల గంగాధర్ తీలక్ కమర్తపు మురళీ మిక్కిలినేని నరేందర్ కార్పొరేటర్ ఎల్లంపల్లి వెంకట్ రావు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు చిన్నికృష్ణ రావు, ప్రధాన కార్యదర్శి మెంతుల శ్రీశైలం వైస్ ప్రెసిడెంట్ నరేష్ ట్రెజరర్ తల్లాడ రమేష్ సహాయ కార్యదర్శి మన్నెం కృష్ణయ్య మరియు బాలసాని లక్ష్మీనారాయణ తదితర పెద్దలు పట్టణ ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరై ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బంధు సూర్యం కార్యదర్శి నకిరికంటి రాధాకృష్ణ సతీష్ ఈసీ మెంబర్లు గడ్డం శ్రీనివాస్ రావు, కొంకిమల్ల వేణు గోపాల్, బుర్లె లక్ష్మీ నారాయణ,సదానంద చారీ , యక్కల సుధాకర్, గట్ల సత్యం, మేకల నాగేశ్వర్ రావు, పెరం వీరభద్రమ్, రాయపూడి జయరా, యడంకంటి రామారావు.