ఖమ్మం ప్రతినిధి ఆగస్టు 11 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ తల్లంపాడు కాంగ్రెస్ గ్రామ కమిటీ, బిగ్ టీవీ, శ్రీ రక్ష హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం శ్రీ రక్ష హాస్పిటల్ వైద్యబృందం స్థానికులకు వైద్యపరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దయాకర్ రెడ్డి మాట్లాడుతూ..సీజనల్ వ్యాధుల కాలం కావడంతో ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పటికే.. వైద్యశాఖ అధికారులను అప్రమత్తం చేశారని తెలిపారు. ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, జ్వరం, ఇతర అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు సమీప ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు కుమ్మరి అంబేడ్కర్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శివారెడ్డి, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అనంతరం పెద్ద తండా లో టెంపుల్ సిటీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాదచారులు సేద తీరేందుకు బల్లాలను ఏర్పాటు చేయగా ఆ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రామసహాయం నరేష్ రెడ్డి, రామ్మూర్తి నాయక్, హరి తదితరులు పాల్గొన్నారు
