రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 12 ఆగస్టు 2024:
మణికొండ భారత రాష్ట్ర సమితి నాయకులు కార్యకర్తలు సోమవారం 12 ఆగస్టు 2024 రోజున ఉదయం సిద్దిపేట శాసన సభ్యుడు తన్నీరు హరీష్ రావుని నానకరామ గూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో గల క్రిన్స్ టెర్మినస్ విల్లాలో మర్యాద పూర్వకంగా కలువడం జరిగినదని, రాబోయే కాలంలో ప్రజల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, ఇప్పటి వరకూ కార్యకర్తలకు సరి అయిన గుర్తింపు లేకుండా పోయిన విషయం తెలుసు కొవడం జరిగినదని మున్ముందు అట్టి పొరపాట్లు జరగకుండా అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని పార్టీ పునర్నిర్మాణమ్ జరుపుకుందామని సెలవిచ్చినట్టు మణికొండ బీ.ఆర్.ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుంభగళ్ల ధనరాజ్ తెలుపుతూ ఈ సందర్భముగా ది సిటిజన్స్ కౌన్సిల్ అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ, మణికొండ కౌన్సిలర్ ఆలస్యం నవీన్ కుమార్, మహిళా అధ్యక్షురాలు రూపా రెడ్డి, విజయలక్ష్మి, రేఖా, సీనియర్ నాయకులు ముతంగి లక్ష్మయ్య, అందె లక్ష్మణ్ రావు, రాజేంద్ర ప్రసాద్, శ్రీకాంత్, జై, బుద్దోల్ బాబు, దిలీప్, భాను, ఉపెండర్నాథ్ రెడ్డి, రామసుబ్బారెడ్డి, యాలల కిరణ్, ఎర్రోళ్ల రమేష్, శివాజీ, ఆరీఫ్, సయ్యద్ రఫిక్, ఎల్లస్వామి, సచిన్, అలి, అశోక్, కృపాకర్, మోనేష్ తదితరులు కలసిన వారిలో ఉన్నారని తెలిపినారు.