సైలెంట్ డీహైడ్రేషన్ తో జాగ్రత్తగా ఉండాలి

– హైదరాబాద్‌లో కిడ్నీ వ్యాధుల పెరుగుదలకు ఇదే కారణం
– ఫ్లూయిడ్, ఎలక్ట్రోలైట్లు తీసుకోవాలి

హైదరాబాద్, జూలై 25, 2024: సైలెంట్ డీహైడ్రేషన్ తో జాగ్రత్తగా ఉండాలి. ఇది తరచూ గుర్తించబడనది. ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేసేది. భారతదేశంలో ప్రధానంగా తెలంగాణాలో వేడి, తేమతో కూడిన వాతావరణం ఉంటుంది. ఈ వాతావరణం మిలియన్ల మందిని నిశ్శబ్దంగా ప్రభావితం చేస్తోంది. డీహైడ్రేషన్ తో దాహం వలే కాకుండా గుర్తించదగిన సంకేతాలు, లక్షణాలు లేకుండా సైలెంట్ డీహైడ్రేషన్ సంభవిస్తుంది. శరీరం క్రమంగా ఫ్లూయిడ్, ఎలక్ట్రోలైట్లను కోల్పోతుంది. దీంతో శరీరం డీహైడ్రేషన్ కు గురవుతుంది. ఫ్లూయిడ్, ఎలెక్ట్రోలైట్స్ కోల్పోవడం వల్ల డీహైడ్రేషన్‌కు దారి తీస్తుందని మనకు తెలుసు. జ్వరం, వికారం, వాంతులు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, వేడి సంబంధిత అనారోగ్యాలతో సహా జ్వరం తదితర లేని పరిస్థితులలో కూడా డీహైడ్రేషన్ గమనించవచ్చు. హైదరాబాద్‌లో కిడ్నీ వ్యాధిగ్రస్తులలో వార్షికంగా 10 నుంచి 15 శాతం పెరుగుదల ఉంది.‌ దీనికి కారణం సైలెంట్ డీహైడ్రేషన్. ఇది తదుపరి వచ్చే అనారోగ్య సమస్యలపై జాగ్రత్తగా ఉండమని కోరుతుంది.

ఈ సందర్భంగా హైదరాబాద్‌ గాంధీ మెడికల్ కాలేజీ మాజీ ప్రొఫెసర్, పీడియాట్రిక్స్ హెడ్ డాక్టర్ సీ సురేష్ కుమార్ మాట్లాడుతూ సైలెంట్ డీహైడ్రేషన్ గుర్తించడం చాలా ముఖ్యమన్నారు. ఎందుకంటే, ఇది తీవ్రమైన వరకు గుర్తించలేమన్నారు. ఈ డీహైడ్రేషన్ సమస్యను అధిగమించడానికి నీరు మాత్రమే సరిపోదన్నారు. ఇది ద్రవ సమతుల్యతను కాపాడుకోవడానికి అవసరమైన ఎలక్ట్రోలైట్‌లను కలిగి ఉండదన్నారు. ఎలక్ట్రోలైట్లు నరాలు, కండరాల పని తీరును నియంత్రించడంలో సహాయపడతాయని తెలిపారు. ఈ డీహైడ్రేషన్ పరిస్థితిని పరిష్కరించడం చాలా కీలకమన్నారు. ఎలక్ట్రోలైట్‌లను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచించిన‌ ఓఆర్ఎస్ తో భర్తీ చేయవచ్చన్నారు. ఇది అతిసార పరిస్థితులలో డీహైడ్రేషన్ పరిష్కరించడానికి ప్రధానంగా సరిపోతుందన్నారు. అతిసారం కాని పరిస్థితులకు శక్తితో కూడిన ఎలక్ట్రోలైట్ రికవరీలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని తెలిపారు. అతిసారం కాని పరిస్థితుల్లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచించిన ఓఆర్ఎస్ సరిపోదని భారతదేశంలోని ప్రముఖ వైద్య నిపుణుల బృందం ధృవీకరించిందని పేర్కొన్నారు. ఇంట్లో తయారు చేసిన ద్రవాలను పరిగణలోకి తీసుకోవచ్చన్నారు. సిద్ధంగా ఉన్న ఎలక్ట్రోలైట్ పానీయాలు అనుకూలమైనవన్నారు. వేగంగా కోలుకోవడానికి, సైలెంట్ డీహైడ్రేషన్ నుంచి బయట పడటానికి సహాయపడుతుందని తెలిపారు.

ద్రవం, ఎలక్ట్రోలైట్ తీసుకోవడంపై అవగాహన పెంపొందించడం చాలా అవసరమన్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు దీర్ఘకాలిక నాన్ డయేరియా పరిస్థితుల నుంచి త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుందని పేర్కొన్నారు. ఎందుకంటే, పిల్లలు, వృద్ధులు సైలెంట్ డీహైడ్రేషన్ ప్రమాదాలకు లోనవుతున్నారన్నారు. డెంగ్యూ లాంటి సాధారణ జ్వరం వంటి వ్యాధులను నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన డీహైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ అసమతుల్యతకు దారితీయవచ్చన్నారు. మహారాష్ట్రలో ఒక బహిరంగ కార్యక్రమంలో డీహైడ్రేషన్, హీట్‌స్ట్రోక్ కారణంగా కనీసం 13 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. ఇండోర్, హైదరాబాద్‌లో పిల్లలు డీహైడ్రేషన్‌తో విషాదకరంగా మరణించిన సందర్భాలు కలవన్నారు. భారతదేశంలో విషాద సంఘటనలు ఎన్నో ఉన్నాయన్నారు. ఈ బాధాకరమైన సంఘటనలు సైలెంట్ డీహైడ్రేషన్ సమస్యను పరిష్కరించడం ఆవశ్యకతను నొక్కి చెబుతుందన్నారు.

అపోలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్‌ ప్రొఫెసర్ (హైదరాబాద్) డాక్టర్ ఎన్ ఎల్ శ్రీధర్ మాట్లాడుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలోనూ డయేరియా లేని పరిస్థితుల్లో వేగంగా కోలుకోవడంలోనూ హైడ్రేషన్ పాత్ర కీలకమన్నారు. ఓరల్ ఫ్లూయిడ్స్, ఎలక్ట్రోలైట్లు కోలుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. సైలెంట్ డీహైడ్రేషన్ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యమన్నారు. ఇది ఒక రహస్య పరిస్థితి అన్నారు. ఇది ముఖ్యంగా పిల్లలు, వృద్ధులలో వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు దారితీస్తుందన్నారు. భారతదేశం ఈ ఆరోగ్య సంక్షోభంతో పోరాడుతూ ఉందన్నారు. ద్రవాలు, ఎలక్ట్రోలైట్‌లను క్రమం తప్పకుండా తీసుకోవడం ఉత్తమమన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking