రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 26 జులై 2024:
ది సిటిజన్స్ కౌన్సిల్ కార్య వర్గమ్ వినమ్ర పూర్వకముగా మణికొండ ప్రజానీకానికి తెలియ జేయడమేమనగా మునిసిపాలిటీ నిధులతో సంబంధం లేకుండా ది సిటిజన్స్ కౌన్సిల్ ఉప కార్యదర్శి, వేంకటేశ్వర కాలనీ అధ్యక్షుడు బొమ్మూ ఉపేంద్రనాధ్ రెడ్డి స్వంత ఖర్చులతో గత వారం రోజులుగా రహదారి మరమ్మత్తులు చేయిస్తున్న విషయం తెలుసుకొని మునిసిపల్ సీ.డీ.ఏం.ఏ అధికారి గౌతం ఐ.ఏ.ఎస్ ఆదేశానుసారం మణికొండ మునిసిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ సందుగు సంజయ్ రెడ్డి ట్విట్టర్ ద్వారా ఉపేంద్రనాధ్ చేయిస్తున్న మరమ్మత్తులు ఆపవలసినదిగా, ప్రత్యాయముగా మణికొండ మునిసిపాలిటీ రోడ్డు మరమ్మత్తులు అన్ని చేయిస్తుందని తెలియ జేసిన దరిమిలా మణికొండ లోని నాగరిక పౌరులుగా బాధ్యతతో మీ మీ ప్రాంతాలలో అవసరం ఉన్న చిన్నా పెద్ద రహదారి మరమ్మత్తు పనులు పురపాలక సంఘం దృష్టికి తీసుకు రావలసిందిగా, అట్టి పనులు సక్రమముగా చేయించు కోవలసినదిగా తెలియ జేయడమైనది,
తదుపరి పురపాలక సంఘ పెద్దల దృష్టికి, ప్రజానీకం తరపున ది సిటిజన్స్ కౌన్సిల్ విన్నవించుకోవడం ఏమనగా వర్షా కాలంలో ప్రజల క్షేమం కోరి రహదారి త్రవ్వకాలకు అనుమతులు ఇవ్వవద్దని కానీ మణికొండ సాయిరాం హుడా కాలనీ లాలమ్మ గార్డెన్స్ పైపులైన్ రహదారి కూడలి వద్ద రహదారికి అడ్డుగా రెండు రోజుల క్రితం త్రవ్వకాలు జరిపినారని ఇట్టి చర్యల వల్ల ప్రజలు ప్రమాదాలకు గురి అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని మరియు ఆంబియన్స్ కోర్టు అపార్ట్మెంట్ వారు యదేచ్ఛగా రహదారి త్రవ్వకాలను సాగిస్తున్నారని, ఈ వర్షాకాలంలో అనుకొని ప్రమాదాలు జరిగి ప్రజలకు ప్రాణహాని కలిగించ వచ్చని కావున మణికొండ లోని రహదారి త్రవ్వకాలను వెంటనే ఆపి కేవలం మరమ్మత్తుల పని కొనసాగించాలని ది సిటిజన్స్ కౌన్సిల్ సభ్యుల విన్నపం.
Prev Post