ప్రజాబలం ప్రతినిధి కూకట్పల్లి
ఆషాఢమాసం బోనాల ఉత్సవాల సందర్భంగా కూకట్పల్లి నియోజకవర్గంలోని, కూకట్ పల్లి, బాలాజీ నగర్, మూసాపేట్ పలు డివిజన్లో అమ్మ వార్ల ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఓబీసీ వర్కింగ్ చైర్మన్ తూము వినయ్ కుమార్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బీసీ సంక్షేమ సంఘం బిసి జర్నలిస్టు ఫోరం అధ్యక్షులు తెల్ల హరికృష్ణ, నరేష్ సంతోష్, అవినాష్, శ్రీకాంత్, బాబు టింకు, పవన్, వినయ్ కుమార్ యూత్ మిత్ర మండలి సభ్యులు తదితరులు పాల్గొనడం జరిగింది, ఈ సందర్భంగా వినయ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ సాంప్రదాయ పండుగల్లో ఒక్కటైన బోనాల పండుగను రాష్ట్రంలో వర్షాలు కురిసి, తెలంగాణ అంత పాడి పంటలతో కళకళలాడాలని, రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది, అమ్మవార్ల ఆశీర్వాదం కృపా కటాక్షంతో ప్రజలంతా సంతోషముతో సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలియజేశారు.