కమ్యూనిటీ భాగస్వామ్యంతోనే టీబి నివారణ

మేడ్చల్ జిల్లా క్షయవ్యాధి నియత్రణ అధికారి డా.శ్రీదేవి
ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జూలై 26:
క్షయవ్యాధి నిర్మూలనలో కమ్యూనిటీ భాగస్వామ్యం ఎంతో అవసరమని మేడ్చల్ జిల్లా క్షయవ్యాధి నియత్రణ అధికారి డా.శ్రీదేవి అన్నారు. చర్లపల్లి ఇండస్ట్రీస్ అసోసియేషన్ ఆఫీసులొ శుక్రవారం రోజున చర్లపల్లి లోనీ వివిధ పరిశ్రమలలో పనిచేస్తున్న ఉద్యోగులు మరియు కాప్ర సర్కిల్ ఉన్న వివిధ మహిళా సంఘాల లీడర్స్ కు కలిపి క్షయవ్యాధి గుర్తించే తీరుపై ఒక్క రోజు శిక్షణ కార్యక్రమం NTEP మరియు టీబి అలర్ట్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించారు. శిక్షణా పొందిన వారంత తాము పనిచేస్తున్న ప్రదేశాల్లో మరియు నివాసం ఉంటున్న ఏరియాలో అలాగే బందువులలో క్షయ వ్యాధి లక్షణాలు ఉన్నవారికి తగిన సలహాలు, సూచనలు ఇచ్చి దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరీక్షలు మరియు ట్రీట్మెంట్ తీసుకోనెేల ప్రొత్సహించాలి అని తెలియచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో NTEP మరియు టీబి అలెర్ట్ ఇండియా పతినిధులు పురుషోత్తం, రాజు పటేల్, కిషోర్, జ్యోతి, క్రిస్టోఫర్ పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking