ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి

హుజురాబాద్ ఏ డి ఏ సునీత

జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి జూలై 26

ప్రతి ఒక్కరు తమ వంతుగా మొక్కలు నాటాలని హుజురాబాద్ ఏ డి ఏ సునిత అన్నారు. జమ్మికుంట మండలం లోని తనుగుల గ్రామంలోని రైతువేదిక వద్ద హరితహారం కార్యక్రమం లో భాగంగా కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు వీరమనేని పరుశరామ్ రావు తో కలిసి మొక్కలు నాటారు. అనంతరం పరుశరామ్ రావు మాట్లాడుతూ రైతులకు రూ. 2లక్షల లోపు రుణమాపి చేస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని, రైతూ భరోసా కూడా త్వరలోనే రైతులకు అందుతుందని అన్నారు. ప్రతి ఇంటికి ఆరు మొక్కల చొప్పున మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతులు గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking