మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించిన..

 

మున్సిపల్ చైర్మన్ తక్కళ్ల పల్లి రాజేశ్వరరావు..

జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి జూలై 26

జమ్మికుంట పట్టణంలోని 21 వ వార్డులో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వరరావు చేతుల మీదుగా మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం విలేకరుల తో మాట్లాడుతూ పట్టణంలోని నాయిని చెరువు కట్ట పైన రెండు ఎకరాలలో మొక్కలు నాటడం జరిగిందని అవి ఇప్పుడు 10 ఫీట్ల ఎత్తులో పెరగడం సంతోషకరమని అన్నారు. ధర్మారం నుండి కొత్తపల్లి వరకు కొత్తపల్లి నుండి మడిపల్లి రోడ్డుకు ఇరువైపుల మోత్కులగూడెం చౌరస్తా నుండి అయ్యప్ప టెంపుల్ వరకు రోడ్డుకు ఇరువైపుల చెట్లను నాటడం జరిగిందని. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ప్రతి ఇంటికి రెండు మొక్కల చొప్పున ఇవ్వడం జరుగుతుందని. మొక్కలు నాటడం వలన కాలుష్య నివారణ అవుతుందని ఇప్పుడున్న రోజుల్లో ప్రతి ఇంటిలో చెట్టు నాటడం అత్యవసరమైన పరిస్థితి అని అన్నారు. ఈ కార్యక్రమంలో హరితహారం ఇన్చార్జి శ్రీకాంత్, హెల్త్ అసిస్టెంట్ మహేష్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking