డానియల్‌ కుమార్‌ కు సన్మానం…..

ప్రభుత్వం విడుదల చేసిన ప్రభుత్వ ఉద్యోగుల ట్రాన్సర్స్‌ జీవో సందర్బంగా బదిలీ అయినా డానియల్‌ కుమార్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ గత 11 సంవత్సరాలు నుంచి హైదరాబాదులో నాంపల్లి కోర్టులో విధులను నిర్వహించారు. అయితే గత పది సంవత్సరాల నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు లేకపోవటం వలన ఒకే ప్రదేశంలో ఉండిపోవడం జరిగినది. ఈ నెలలో ప్రభుత్వం ఇచ్చిన జీవో వలన ఉద్యోగులకు బదిలీ అయ్యే అవకాశం కలిగింది. ఈ సందర్భంలో ప్రాసిక్యూషన్స్‌ డిపార్ట్మెంట్‌ నుంచి అనేకమంది పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు తెలంగాణ మొత్తంలో బదిలీ అయినారు. డానియల్‌ కుమార్‌ బదిలీపై వెళ్తున్న సందర్భంగా పోలీసు అధికారులు, ఏర్పాటు చేసిన ఈ సన్మాన కార్యక్రమానికి 15 నెంబర్‌ కోర్టు జడ్జి ఉదయ భాస్కర్‌ మరియు కోర్టు సిబ్బంది మరియు పోలీసు అధికారులు మరియు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు హాజరైనారు. ఈ కార్యక్రమానికి హాజరు అయిన జడ్జి పోలీసు అధికారులు మాట్లాడుతూ డానియల్‌ కుమార్‌ కేసుల్లో వచ్చిన బాధితులకు ఎంతో సహనంతో వారి యొక్క సమస్యలను విని సత్వరన్యాయం జరిగే విదంగా వారి కేసులను ముందుకు తీసుకు వెళ్లేవారని అభినందించారు. ఈ కార్యక్రమంలో నూతనంగా బదిలీ అయి 15 నెంబర్‌ కొట్టుకు వచ్చిన పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ దీపారాణి గారు మాట్లాడుతూ డానియల్‌ కుమార్‌ కేసులో వచ్చే బాధితులకు ఎంతో సహనంతో వారి యొక్క సమస్యను తెలుసుకొని కేసులు చక్కగా ముందుకు తీసుకొని వెళ్లి బాధితులకు ఆయన కోర్టులో న్యాయం జరిగే విధంగా వాదించినారు అని కొనియాడారు. ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసిన సౌత్‌ వెస్ట్‌,నార్త్‌ ,సౌత్‌ ,సౌత్‌ ఈస్ట్‌ ఇన్స్పెక్టర్‌ లు శ్రీనివాస్‌, సత్యనారాయణ, కిషన్‌ నాయక్‌,శ్రేయ లను డానియల్‌ కుమార్‌ ప్రత్యేకంగా అభినందించినారు. ఈ కార్యక్రమంలో బదిలీపై వెళ్తున్న డానియల్‌ కుమార్‌ మాట్లాడుతూ 11 సంవత్సరాలు 15 నెంబర్‌ కోర్టులో సుదీర్ఘ ప్రయాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికి పోలీసు అధికారులకు, న్యాయాధికారులకు, కోర్టు సిబ్బందికి, న్యాయవాదులకు, సహాచర పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లను, డిప్యూటీ డైరెక్టర్లకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియపరచినారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking