తెలంగాణ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కోరిన ఎంపీ వంశీకృష్ణ

ప్రజాబలం మందమర్రి మండల రిపోర్టర్ నవంబర్ 27 :

తెలంగాణ రాష్ట్రంలోని భక్తులకు తిరుపతిలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ కలిసి కోరారు.
బుధవారం ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో కలిసి భేటీ అనంతరం తెలంగాణ భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానంలో మరింత మెరుగైన దర్శన సౌకర్యాలు కల్పించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, తిరుమలకి తెలంగాణ నుండి వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని, వారి దర్శనం కోసం ప్రత్యేక కేటాయింపులు, సదుపాయాలు అవసరమని సూచించారు. భక్తులకు వెయ్యి నెంబర్ల కోటాను పెంచడం, ప్రత్యేక దర్శనం టోకెన్లు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయంలో సహకరించి, భక్తుల సౌకర్యం కోసం అవసరమైన చర్యలు తీసుకుంటుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారని చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking