కుటుంబ సర్వే వివరాలను ఆన్ లైన్ లో నమోదు

ఏలాంటి తప్పులు జరిగిన ఎన్యుమరేటర్లు, సూపర్ వైజర్లదే పూర్తి బాధ్యత

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ గౌతమ్

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నవంబర్ 27:రాష్ట్ర ప్రభుత్వం ఏంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సామాజిక, ఆర్థిక, విద్య,ఉపాధి,రాజకీయ మరియు కుల సర్వే (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే) వివరాలను ఆన్ లైన్ లో అప్ లోడింగ్ చేస్తున్న ఆపరేటర్ పక్కన అందుబాటులో లేని ఇద్దరు ఎన్యుమరేటర్లను వెంటనే సస్పెండ్ చేయాలని మున్సిపల్ కమీషనర్ ను మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరు గౌతం ఆదేశించారు.
బుధవారం మేడ్చెల్ మున్సిపాలటీలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహిస్తున్న ఇంటింటి సర్వే వివరాల ఆన్ లైన్ అప్ లోడింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టరు తనిఖీ చేసారు. ఈ ప్రక్రియలో ఎన్యుమరేటర్లు లేకుండా సర్వే వివరాలను అప్ లోడ్ చేస్తున్న ఆపరేటర్లను గమనించిన కలెక్టరు ఎన్యుమరేటర్లు ఎక్కడ అని అడిగి, అందుబాటులో లేని ఎన్యుమరేటర్లను వెంటనే సస్పెండ్ చేయాలని మేడ్చెల్ మున్సిపల్ కమీషనర్ ను ఆదేశించారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మ్యకంగా నిర్వహిస్తున్న సర్వేలో ఎలాంటి పొరపాటును కూడా సహించేది లేదని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎంతో బాధ్యతగా నిర్వహించాల్సిన విధుల పట్ల ఏమాత్రం నిర్లక్ష్యం వహించిన చర్యలు తీవ్రంగా ఉంటాయని కలెక్టరు హెచ్చరించారు. ఆపరేటర్లు కేవలం అన్ లైన్ లో ఆప్ లోడ్ చేయడం వరకే వారి బాధ్యతని, ఏలాంటి తప్పులు జరిగిన ఎన్యుమరేటర్లు, సూపర్ వైజర్లదే పూర్తి బాధ్యతని కలెక్టరు స్పష్టం చేసారు. ఎన్యుమరేటర్లు ప్రక్కన ఉన్నంత సేపు మాత్రమే ఆపరేటర్లు సర్వే వివరాలు అప్ లోడ్ చేయాలని కలెక్టరు సూచించారు. సమయం వృధా కాకుండా ఎన్యుమరేటర్లు, ఆపరేటర్లు ఒకే సమయంలో భోజనం చేయాలని తెలిపారు. సూపర్ వైజర్లు దగ్గరుండి ఎన్యుమరేటర్లు, ఆపరేటర్ల పనితీరును పర్యవేక్షించాలని ఆదేశించారు. తప్పులు లేకుండా సర్వే వివరాలను నిర్దేశిత సమయంలో ఆన్ లైన్ లో అప్లోడ్ చేయించాలని సంబంధిత అధికారులను కలెక్టరు ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మేడ్చెల్ తహసీల్దారు శైలజ, మున్సిపల్ కమీషనర్ నాగిరెడ్డి, ఎంపిడిఓ సంపూర్ణ, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking