అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ నిర్మాణ పనుల పర్యవేక్షించిన కలెక్టర్ గౌతమ్

 

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నవంబర్ 27:రాష్ట్ర ప్రభుత్వం ఐటిఐ కాలేజీలను అధునాతన సాంకేతిక నైపుణ్య శిక్షణ కేంద్రాలుగా (స్కిల్లింగ్ సెంటర్లు) తీర్చిదిద్దే దిశగా మేడ్చెల్ ఐటఐ కాలేజీలో నిర్మిస్తున్న అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ నిర్మాణ పనుల పురోగతిని మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరు గౌతం పరిశీలించారు.
బుధవారం మేడ్చెల్ ఐటిఐ కాలేజీలో నిర్మిస్తున్న అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించి నిర్ణీత గడువులోగా నిర్మాణ పనులు పూర్తవ్వాలని ఛీఫ్ ఇంజనీర్ ను కలెక్టరు ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ ప్లోరింగ్, సీడింగ్, ఎలక్ట్రిక్ వర్క్స్, విండోస్, పార్టిషన్ వంటి నిర్మాణ పనులు పూర్తవ్వడానికి ఇంకా ఎంత సమయం పడుతుందని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తవ్వాలని కలెక్టరు ఆదేశించారు. అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ లలో 6 ట్రెడింగ్ విభాగాలకు గాను గదులను నిర్మించి మిషినరీ స్థాపించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ఎలివేషన్, స్లాబ్ పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టరు సూచించారు.
ఈ కార్యక్రమంలో ఛీఫ్ ఇంజనీర్ శ్యాంసుందర్, మేడ్చెల్ తహసీల్దారు శైలజ, మున్సిపల్ కమీషనర్ నాగిరెడ్డి, ఎంపిడిఓ సంపూర్ణ, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking