రాష్ట్ర అధ్యక్షులు నరాల సత్యనారాయణ
ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి నవంబర్ 27 (ప్రజాబలం) తెలంగాణ రక్షణ సమితి ప్రజా సంకల్ప పాదయాత్ర పోస్టర్ ను రాష్ట్ర అధ్యక్షులు నరాల సత్యనారాయణ ఆవిష్కరించారు ప్రజా సంకల్ప పాదయాత్ర ముఖ్య ఉద్దేశం నిరుద్యోగ యువతి యువకులను కలవడం, రైతులను, కౌలు రైతులను కలవడం, రైతు రుణమాఫీ రైతుబంధు, రైతు భరోసా విషయంలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించే విధంగా ప్రజాసంకల్ప పాదయాత్ర జరుగుతుంది
తెలంగాణలో జరుగుతున్న అవినీతిని ప్రశ్నించే విధంగా అక్రమాలను ప్రశ్నించే విధంగా, 35 లక్షల మంది నిరుద్యోగులకు జరిగిన అవినీతిని ప్రశ్నించే విధంగా అవ్వ తాతలకు పెన్షన్ సరైన విధానంలో రాకపోయే విధానం గురించి ప్రశ్నించే విధంగా ప్రజాసంకల్ప పాదయాత్ర కొనసాగుతుంది ప్రజా సంకల్ప పాదయాత్ర జనవరి 17న ప్రారంభమై ఆగస్టు 17వ తేదీన ముగుస్తుంది. జనవరి 17వ తేదీన భద్రాచలంలో ప్రారంభమై ఆగస్టు 16వ తేదీన హైదరాబాద్ చిలుకూరి బాలాజీ దేవాలయం వద్ద ముగుస్తుంది. చెరుకూరి బాలాజీ దేవాలయం వద్ద పూజలు ముగిసిన తర్వాత ఎల్బీనగర్ లో ఆగస్టు 17వ తేదీన భారీ బహిరంగ సభ ఉంటుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు నరాల సత్యనారాయణ తెలియజేశారు మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలతో ఏర్పడిన తెలంగాణ ఎడారి తెలంగాణగా బానిస తెలంగాణగా మారిపోయింది రైతులకు న్యాయం జరగలేదు నిరుద్యోగులకు న్యాయం జరగలేదు, అవ్వ తాతలకు న్యాయం జరగలేదు, మహిళలకు న్యాయం జరగలేదు, సబ్బండ వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ అగ్రవర్ణ పేదలకు తెలంగాణలో న్యాయము జరగక అనేక ఇబ్బందులు పడుతున్నారు ప్రజా సంకల్ప పాదయాత్రలో భాగంగా 8 నెలల పాటు ప్రజల మధ్యలో ఉంటూ, ప్రజలను కలుస్తూ, ప్రజల కష్టసుఖాలను తెలుసుకుంటూ, ప్రజల బాధలను తెలుసుకుంటూ ప్రజాసంకల్ప పాదయాత్ర కొనసాగుతుంది ప్రజా సంకల్ప పాదయాత్రలో తెలంగాణ ప్రజల కష్ట నష్టాలను, బాధలను తెలుసుకుంటూ మేనిఫెస్టో రూపొందించడం జరుగుతుందని రాష్ట్ర అధ్యక్షులు నరాల సత్యనారాయణ తెలియజేశారు కాళ్లేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి గాని, చత్తీస్ గడ్ ఎలక్ట్రిసిటీ ఒప్పందంలో గాని, ప్రభుత్వ ఉద్యోగులు ఇతర దేశాలకు పారిపోయి గ్రీన్ కార్డు తెచ్చుకోవడం గానీ, తెలంగాణ సంపద ఆవిరైపోవడం గాని, తెలంగాణ తలసరి ఆదాయం పడిపోవడం గానీ తెలంగాణ మిగులు బడ్జెట్ గా ఉన్న పరిస్థితి నుంచి లోటు బడ్జెట్ గా మారిపోవడం గాని ప్రశ్నిస్తూ ప్రజాసంకల్ప పాదయాత్ర కొనసాగుతుంది ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సమితి రాష్ట్ర కమిటీ సభ్యులు కొత్తూరు శంకర్, మాలోతు సువర్ణ, మల్లు స్వరూప, భూక్యాశిరోమణి తదితరులు పాల్గొన్నారు