సమాజానికి చేసే సేవ శాశ్వతంగా నిలిచిపోతుంది జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

 

నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు విద్యార్థులు క్రమ పద్ధతిన కృషి చేయాలి

వి.వెంకటాయపాలెం గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో బోర్వెల్, పైప్ లైన్ ఆర్.ఓ. ప్లాంట్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

ఖమ్మం ప్రతినిధి నవంబర్ 27(ప్రజాబలం) ఖమ్మం సమాజంలో నలుగురికి ఉపయోగపడే పనులు చేస్తూ సేవలు అందించే వారే శాశ్వతంగా నిలిచిపోతారని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు రఘునాధపాలెం మండలం వి. వెంకటాయ పాలెం గ్రామంలోని జహీర్ అహ్మద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 3 లక్షల 50 వేల రూపాయలతో ఏర్పాటు చేసిన బోర్ వెల్, పైప్ లైన్, ఆర్. ఓ.ప్లాంట్ ను, 50 వేల విలువ గల కరెంట్ మోటర్ ను జిల్లా కలెక్టర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు కుతుంబాక బసవ నారాయణ కుతుంబాక కోటేశ్వరరావు స్నేహానికి జ్ఞాపకార్ధంగా పాఠశాలకు 3 లక్షల 50 వేల విలువచేసే ఆర్.ఓ. ప్లాంట్, బోర్ వెల్, పైప్ లైన్ ను కూతుంబాక మధు, 50 వేల రూపాయల కరెంట్ మోటర్ ను కూరాకుల నాగభూషణం పాఠశాలకు విరాళంగా అందించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాల అవసరాలను తీర్చేందుకు ముందుకు వచ్చిన దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మాటలకే పరిమితం కాకుండా విద్యార్థుల శ్రేయస్సు గురించి ఆలోచించి వసతులు కల్పించడం సంతోషకరమని అన్నారు పాఠశాలలో అవసరమైన టాయిలెట్లు సైతం రాబోయే రోజులలో పూర్తి చేస్తామని అన్నారు.

పాఠశాలకు జహీర్ అహ్మద్ పేరు పెట్టారని, కొంత సమయం గడిచిన తర్వాత మన రంగు, కులం, మతం, ఆస్తి ఎవరు గుర్తు పెట్టుకోరని, సమాజంలో మనం చేసిన సేవే శాశ్వతంగా గుర్తుంటుందని కలెక్టర్ తెలిపారు సమాజం కోసం పనిచేసే వారికి విలువ ఉంటుందని అన్నారు. విద్యార్థులు జీవితంలో ఎదగడంతో పాటు ఇతరులకు సహాయం చేసే ఆలోచనతో ఉండాలని, మన గ్రామాలను,రాష్ట్రాలను బాగు చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. జీవిత లక్ష్యాలను నిర్దేశించుకుని, దాన్ని సాధించేందుకు చేయాల్సిన పనులు క్రమ పద్ధతి ప్రకారం పూర్తి చేయాలని అన్నారు విద్యార్థి దశలో పౌష్టికాహారం తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, మన స్నేహితులు కూడా బాగా చదువుకునేలా ప్రోత్సహించాలని, అందుబాటులో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, క్రమశిక్షణతో చదివితేనే గొప్ప విజయాలు సాధ్యమవుతాయని కలెక్టర్ అన్నారు

 


అంతకుముందు జిల్లా కలెక్టర్ పాఠశాలలోని లైబ్రరీనీ పరిశీలించి ఆకర్షణీయంగా, పిల్లలను ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దాలని అన్నారు. పాఠశాలలోని విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్, షూస్ కొరకు గతంలో కలెక్టర్ అందించిన లక్షా 50 వేలతో కొనుగోలు చేసిన స్పోర్ట్స్ డ్రెస్, షూస్ ను జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా పరిశీలించారు అనంతరం దాతలు కూతుంబాక మధు, కూరాకుల నాగభూషణం ను జిల్లా కలెక్టర్ సన్మానించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాద్యాయులు, విద్య కమిటీ చైర్ పర్సన్ గ్రామ పెద్దలు తదితరులు పాల్గోన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking