సింగరేణి రిటైర్డ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

-టీబీజీకేఎస్ నాయకుల డిమాండ్

ప్రజాబలం మందమర్రి మండల రిపోర్టర్ నవంబర్ 27 :

సింగరేణి సంస్థలో పనిచేసి మెడికల్ అన్ ఫిట్ కార్మికులు, రిటైర్డ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని టిబిజికేఎస్ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం టి.బి.జి.కె.ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సింగరేణిలో పనిచేసి 2021 జులై తర్వాత రిటైర్డ్ అయిన కార్మికుల కు 11వ వేజ్ బోర్డ్ ద్వారా చెల్లించవలసిన పెన్షన్ వెంటనే అమలు చేయాలన్నారు. గోదావరిఖనిలోని సీఎం పీఎఫ్ కార్యాలయం పరిధిలో ఐదువేల మంది రిటైర్మెంట్ కార్మికులు ఉన్నారని కొత్త పెన్షన్ పొందక పాత పెన్షన్ ఇవ్వడం వలన చాలీచాలని పింఛన్ తో కార్మికులు ఇబ్బంది పడుతున్నారన్నారు. రిటైర్మెంట్ అయిన కార్మికులకు అంబికా దర్బార్ బత్తి సంస్థలో 15 సంవత్సరాలు పని చేసిన కార్మికులకు 150 గజాల ఇల్లు స్థలాన్ని ఇస్తున్నారని అదేవిధంగా సింగరేణిలో కూడా 36 సంవత్సరాలు కష్టపడ్డా రిటైర్డ్ కార్మికులకు రెండు గుంటల జాగా గాని లేదా కాలిక్వాటర్స్ కానీ ఇవ్వాలన్నారు. విశ్రాంత ఉద్యోగుల సమస్యల గురించి యూనియన్ నాయకులకు ఎన్నిసార్లు మా సమస్యలను విన్నవించుకున్న పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా యూనియన్ నాయకులు చొరవ తీసుకొని వారి సమస్యలను పరిష్కరించాలని లేనిపక్షంలో గెలిచిన యూనియన్ కార్యాలయల ముందు ధర్నాలు చేయుటకు వెనకాడ బొమని హెచ్చరించారు. ఈ సమావేశంలో బిఆర్ఎస్ చెన్నూరు నియోజవర్గ సీనియర్ నాయకులు డాక్టర్ రాజా రమేష్, మందమర్రి పట్టణ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జె. రవీందర్, యూనియన్ వైస్ ప్రెసిడెంట్ మేడిపల్లి సంపత్, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ బడికల సంపత్, సెంట్రల్ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ ఓ.రాజశేఖర్, బిఆర్ఎస్ పార్టి సీనియర్ నాయకులు బండారు సూరిబాబు, తిరుపతి రెడ్డి, బోరిగం వెంకటేష్ , ఎండి అబ్బాస్, బర్ల సదానందం, మేడిపల్లి మల్లేష్, పల్లె నర్సింగ్, భూపెల్లి కనకయ్య, కొండలరావు, చేకొండ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking