మహబూబ్ నగర్ రైతు విజయోత్సవ సభను విజయవంతం చేద్దా

– కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ మెదక్ జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి

ఈనెల 29 30 తేదీలలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న రైతు విజయోత్సవ సంబరాలను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ మెదక్ జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి పార్టీ శ్రేణులను, రైతులను కోరారు. బుధవారం కొత్తపల్లి సొసైటీ హాలు లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ రైతులకు పెద్దపీట వేస్తూ బాసటగా నిలుస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశ చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసి చరిత్ర సృష్టించింది అన్నారు. సాంకేతిక కారణాలతో ఆగిపోయిన మిగతా రైతుల రుణమాఫీ త్వరలో మాఫీ అవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొదటి బడ్జెట్లోనే 72,000 కోట్లు కేటాయించి ఇటు తెలంగాణ, అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో వ్యవసాయానికి అత్యధిక బడ్జెట్ కేటాయించిన ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం నిలిచిందన్నారు. గత యాసంగిలో రైతు భరోసా నిధులు విడుదల చేయడం జరిగిందని ఆ తర్వాత పంటకు మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసి రైతుల అభిప్రాయాలను తీసుకున్న తర్వాత డిసెంబర్లో రైతు భరోసా కొనసాగుతుందన్నారు. ఉగాది నుంచి రేషన్ లో సన్నబియ్యం ఇస్తామని మంత్రి ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర రైతాంగం పై ప్రత్యేక దృష్టి సాధిస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మహబూబ్నగర్ రైతు విజయోత్సవ సభకు మెదక్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, కిసాన్ కాంగ్రెస్ నాయకులు రైతులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోవవింద్ నాయక్, సీనియర్ నాయకులు ప్రశాంత్ రెడ్డి, కొత్తపల్లి సొసైటీ చైర్మన్ రమేష్ గుప్తా, మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి , మైనారిటీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆఫీస్ మోల్ సబ్, నాయకులు వెంకటేశ్వర్ రెడ్డి సందీప్ రమేష్ గౌడ్ ముజీభ్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking