జీహెచ్‌ఎంసీ ప్రజాబలం ప్రతినిధి: హైదరాబాద్, నవంబర్ 27: జీహెచ్‌ఎంసీ ఉద్యోగి గా విధులు నిర్వహిస్తూ క్రీడా రంగంలో సాధించిన విజయాలు గర్వకారణమని జీహెచ్‌ఎంసీ కమీషనర్ ఇలంబర్తి అన్నారు. బుధవారం జీహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలోని కమీషనర్ ఛాంబర్ లో జీహెచ్‌ఎంసి ఉద్యోగి, విక్టరీ ప్లే గ్రౌండ్ ప్లేయర్, జాతీయ స్థాయి రెజ్లింగ్ క్రీడల్లో బంగారు పతకం సాధించింది. జూడో క్రీడలో ఢల్లీి నుండి రజత పతకం సాధించిన అంబికా రాణిని అడిషనల్ కమిషనర్ యాదగిరి రావుతో కలిసి కమీషనర్ శాలువతో సన్మానించారు.