మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి అధ్యక్షతన బుధవారం 6వ స్టాండిరగ్‌ కమిటీ సమావేశం

9 అంశాలు కు స్టాండిరగ్‌ కమిటీ ఆమోదం
జీహెచ్‌ఎంసీ ప్రజాబలం ప్రతినిధి:హైదరాబాద్‌, నవంబర్‌ 27: నగర మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి అధ్యక్షతన బుధవారం 6వ స్టాండిరగ్‌ కమిటీ సమావేశం జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో జరిగింది. కమిటీ సమావేశంలో 9 అంశాలు, ఒక టేబుల్‌ ఐటమ్‌ కు సభ్యులు ఆమోదించినట్లు మేయర్‌ తెలిపారు.
ఈ సమావేశంలో జీహెచ్‌ఎంసీ కమీషనర్‌ ఇలంబర్తి, స్టాండిరగ్‌ కమిటీ సభ్యులు బన్నాల గీత ప్రవీణ్‌ ముదిరాజ్‌, మహమ్మద్‌ ముజాఫర్‌ హుస్సేన్‌, ఫాహెద్‌ బిన్‌ అబ్దుల్‌ సమద్‌, మహమ్మద్‌ ఖాదీర్‌, మహమ్మద్‌ నసీరుద్దీన్‌, మహమ్మద్‌ గౌస్‌ ఉద్దీన్‌, మన్నె కవితా రెడ్డి, మహమ్మద్‌ రషీద్‌ ఫరాజుద్దీన్‌, ఉప్పలపాటి శ్రీకాంత్‌, సబిహా బేగం, చింతల విజయ్‌ శాంతి, కంది శైలజ, అడిషనల్‌ కమిషనర్లు నళిని పద్మావతి, సరోజ, పంకజ, గీత రాధిక, చంద్రకాంత్‌ రెడ్డి, జోనల్‌ కమిషనర్లు అనురాగ్‌ జయంతి, అపూర్వ చౌహాన్‌, హేమంత్‌ కేశవ్‌ పాటిల్‌, రవికిరణ్‌, ఉపేందర్‌ రెడ్డి, వెంకన్న, ఎస్‌.ఈ రత్నాకర్‌, వేణుగోపాల్‌ రెడ్డి, అకౌంట్‌ ఎగ్జామినర్‌ వేంకటేశ్వర రెడ్డి, సెక్రటరీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
స్టాండిరగ్‌ కమిటీలో ఆమోదించిన అంశాలు
ఎస్‌.ఎన్‌.డి.పి కింద నాగమయ్య కుంట నాలా రీ మోడలింగ్‌ రూ.19.34 కోట్లతో పూర్తయినందున జీహెచ్‌ఎంసీ అందుబాటులో గల ఎస్‌.ఎన్‌.డి.పి మిగులు నిధులతో నాలా పొడిగింపుకు ప్రతిపాదించిన బాక్స్‌ డ్రెయిన్‌ నిర్మాణంకు రూ. 3 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టుటకు కమిటీ ఆమోదం.
హబీబ్‌ నగర్‌ నుండి చాంద్రాయణగుట్ట మెయిన్‌ రోడ్‌, రియాసత్‌ నగర్‌ నుండి హబీబ్‌ నగర్‌ వయా పాపా లాల్‌ టెంపుల్‌ వరకు రహదారి అభివృద్ధికి జీహెచ్‌ఎంసీ పరిధిలో గల 174 ఆస్తుల సేకరణకు కమిటీ ఆమోదం.

ఖైరతాబాద్‌ జోన్‌ మెహిదీపట్నం సర్కిల్‌ మల్లేపల్లి మోడల్‌ మార్కెట్‌ బిల్డింగ్‌ సమీప స్లమ్‌ ఏరియా నిరుద్యోగ యువత, వెనుకబడిన మహిళలకు సీ.ఎస్‌.ఆర్‌ కింద లైట్‌ హౌస్‌ కమ్యూనిటీ ఫౌండేషన్‌ వారి సొంత నిధులతో సెంటర్‌ ఫర్‌ స్కిల్లింగ్‌ అండ్‌ లవ్లీ హుడ్‌ ప్రోగ్రాం ద్వారా శిక్షణలు నిర్వహించుటకు ఒక సంవత్సర కాలం పాటు మల్లేపల్లి మోడల్‌ మార్కెట్‌ బిల్డింగ్‌ ను స్వాధీనం చేయుటకు అనుమతిస్తూ సంబంధిత ఏజెన్సీ తో ఖైరతాబాద్‌ జోనల్‌ కమిషనర్‌ ఎం.ఓ.యు చేయుటకు కమిటీ ఆమోదం.
ఎఫ్‌.సి.ఐ గోడౌన్‌ రోడ్‌ నుండి చర్లపల్లి రైల్వే సరిహద్దు వయా ఐ.ఓ.సి.ఎల్‌ నుండి గ్రోసెన్‌ హెల్త్‌ కేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వరకు ప్రతిపాదించిన 24 మీటర్ల నుండి 30 మీటర్ల వరకు పెంచడానికి రివైజ్డ్‌ ప్రతిపాదనలు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తూ రివైజ్డ్‌ ఆర్‌.డి.పి లో 6 ఆస్తుల సేకరణకు కార్పొరేషన్‌ ద్వారా ప్రభుత్వానికి సిఫారసు చేయుటకు కమిటీ ఆమోదం.
జీహెచ్‌ఎంసీ పరిధిలోని 150 వార్డులలో క్రీడా కార్యక్రమాల నిర్వహణకు ప్రతి కార్పొరేటర్‌ డివిజన్‌ కు రూ.2 లక్షల విలువైన ఆటలు/ క్రీడల మెటీరియల్‌ అందించడానికి కమిటీ ఆమోదం.
ఆగస్టు 2024 మాసం జిహెచ్‌ఎంసి కి సంబంధించిన ఆదాయ, వ్యయాలకు కమిటీ ఆమోదం.
ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన జీహెచ్‌ఎంసీ మేయర్‌ క్యాంపు కార్యాలయంలో పనిచేస్తున్న కంప్యూటర్‌ ఆపరేటర్‌ (బి.నాగరాజు) సేవలు పొడగించుటకు, సికింద్రాబాద్‌ జోన్‌ లో అదనపు పోస్ట్‌ మంజూరుకు జీహెచ్‌ఎంసీ అనుమతి/ రాటిఫికేషన్‌ కు కమిటీ ఆమోదం.
పోలీస్‌ శాఖకు చెందిన నాంపల్లి వార్డు 45లో గల పోలీస్‌ క్వార్టర్స్‌ మరియు గోషామహల్‌ బంక్‌, స్టేడియం, బాస్కెట్‌ బాల్‌, బాడ్మింటన్‌ కోర్ట్‌ లకు సంబంధించిన 31.39 ఎకరాల భూమిని ఉస్మానియా జనరల్‌ ఆసుపత్రి నిర్మాణానికి గాను ఎన్‌.ఓ.సి జారీ చేయుటకు జీహెచ్‌ఎంసి సిఫార్సు చేస్తూ కమిటీ ఆమోదం.
సెప్టెంబర్‌ 2024 మాసం జిహెచ్‌ఎంసి కి సంబంధించిన ఆదాయ, వ్యయాలకు కమిటీ ఆమోదం.

Leave A Reply

Your email address will not be published.

Breaking