– మంత్రి పొంగులేటికి డీజేయూ ఆధ్వర్యంలో వినతి .
కొత్తగూడెం జిల్లా ప్రతినిధి , నవంబర్ 27 ( ప్రజాబలం) :—
జిల్లాలోని అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఇందిరమ్మ గృహలు మంజూరు చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ, గృహనిర్మాణ, సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి డెమోక్రటిక్ జర్నలిస్ట్ యూనియన్ భద్రాద్రి జిల్లా కన్వీనర్ సీమకుర్తి రామకృష్ణ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామని, ఇళ్ల స్థలాలు అందిస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో, ఇందిరమ్మ రాజ్యంలో జిల్లాలో అర్హులైన జర్నలిస్టులను గుర్తించి న్యాయం చేయాలన్నారు. సానుకూలంగా స్పందించిన మంత్రి పొంగులేటి విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి అందరికి న్యాయం జరిగే విధంగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు చెంగపొంగు సైదులు, అఫ్జల్ పఠాన్, మేర మహేష్, డేగల,కృష్ణ ప్రసాద్, ఉబ్బెనపల్లి ప్రసాద్, కనక మౌలాలి, వంకాయలపాటి వెంకట్, దొడ్డ లక్ష్మణ్ రావు, కంచు శ్రీనివాస్, పూనెం రమేష్, వినోద్, సతీష్ తదితరులు పాల్గొన్నారు