రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 27 నవంబర్ 2024
భారత రాష్ట్ర సమితి పార్టీ మణికొండ నాయకులు ఈ మధ్యన తలపెట్టిన ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా స్థానిక ప్రజలు తమ తమ అభిప్రాయాలను, ఎదుర్కుంటున్న కష్ట నష్టాలను స్వేచ్చగా వ్యక్త పరుస్తున్న దరిమిలా కొంతమంది భక్తులూ భారత రాష్ట్ర సమితి పార్టీ సీనియర్ నాయకుడు బుద్దోల్ బాబును కలసి సాయిరాం కాలనీలోని ఆంజనేయ స్వామి దేవాలయం పైప్ లైన్ కూడలిలో ఎత్తు పల్లాల రహదారి, డ్రైనేజీ నీటితో ఆలయానికి రాక పోకలకు తీవ్ర ఇబ్బంది కలుగు తున్నదని తెలిపిన వెంటనే శ్రమ దానంతో కూడిన స్వంత నిధులు రాఘవ రెడ్డి, శ్రీనివాస్ చారి, రవీందర్ రెడ్డి, రాజు, భాషా, తుకారాంల సహకారంతో వెచ్చించి ప్రజా సౌకర్యార్థం మరమ్మత్తులు గావించినాడు, కార్య క్రమంలో అందె లక్ష్మణ్ రావు, యాలాల కిరణ్, బోడ్డు శ్రీధర్, భాను, స్థానిక ప్రజలు తది తరులు పాల్గొన్నారు.
Prev Post