ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రజల కొరకు మెరుగైన వైద్య సేవలు

 

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 18 : మంచిర్యాల జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులు, సామాజిక, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రజల కొరకు మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.మంగళవారం జిల్లాలోని లక్షెట్టిపేట మండల కేంద్రంలోని 100 పడకల ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించి ఆసుపత్రిలోని వార్డులు,ల్యాబ్,మందుల నిల్వలు,రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని,ఈ క్రమంలో మండల కేంద్రంలోని 30 పడకల ఆసుపత్రిని 100 పకడల ఆసుపత్రిగా అభివృద్ధి చేసి అనేక రకాల వైద్య సేవలు అందుబాటులో ఉంచడం జరుగుతుందని తెలిపారు. వైద్యులు,సిబ్బంది విధుల పట్ల బాధ్యతగా వ్యవహరిస్తూ ఆసుపత్రికి వచ్చే ప్రజలతో మర్యాద పూర్వకంగా వ్యవహరించాలని,మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలిపారు.ఆసుపత్రిలో అవసరమైన మందుల నిల్వలను అందుబాటులో ఉంచడం,ఆసుపత్రిలోని వార్డులు,పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంపై ప్రత్యేక దృష్టి సారించాలని, వైద్యులు, సిబ్బంది ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని తెలిపారు.కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయం, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలను సందర్శించి విద్యార్థినీ,విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన నాణ్యత, పాఠశాల పరిసరాలు, రిజిస్టర్లను పరిశీలించి ఉపాధ్యాయులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.విద్యార్థుల సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం డైట్,కాస్మొటిక్ చార్జీలను పెంచి అందిస్తుందని,ఈ క్రమంలో విద్యార్థులకు నూతన మెను ప్రకారం సకాలంలో పోషక విలువలు గల ఆహారాన్ని అందించాలని,వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ద వహించాలని తెలిపారు. 10వ తరగతి పరీక్షలు సమీపిస్తున్నందున విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేయాలని,ప్రత్యేక తరగతులు నిర్వహించాలని,తరగతిలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. అనంతరం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన మెదక్ – నిజామాబాద్- ఆదిలాబాద్- కరీంనగర్ నియోజకవర్గ పట్టభద్రుల ఎం.ఎల్.సి.పోలింగ్ కేంద్రం నం.32ను సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు.తహశిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి రిజిస్టర్లు,రికార్డులను పరిశీలించారు. వివిధ రకాల ధృవపత్రాల కొరకు అందిన దరఖాస్తులను నిబంధనల మేరకు పరిశీలించి నిర్ణీత గడువులోగా జారీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని,అధికారులు విధుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు. మున్సిపల్ పరిధిలోని డంపింగ్ యార్డును సందర్శించి మున్సిపల్ పరిధిలోని వార్డులలో ప్రతి రోజు ప్రతి ఇంటి నుండి తడి,పొడి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలించాలని,ఇందులో ఉ పయోగకరమైన చెత్తను వేరుచేసి కంపోస్ట్ షెడ్కు తరలించే విధంగా సంబంధిత అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తహశిల్దార్ దిలీప్ కుమార్,మున్సిపల్ కమీషనర్ మారుతి ప్రసాద్,పాఠశాలల ఉపాధ్యాయులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking