బంజారా జాతులే కాకుండా యావత్ ప్రజలు సేవాలాల్ మార్గంలో నడవాలి- మత్స్య శాఖ డైరెక్టర్ గడప దేవేందర్
సొసైటీలో మంచి మార్గంలో ఉంటే అది సేవాలాల్ అడుగు జాడలో ఉన్నట్టే -మున్సిపల్ కమిషనర్ గణేష్ రెడ్డి
గజ్వేల్ నియోజకవర్గం ప్రజాబలం ప్రతినిధి :-
తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ సంత సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి ఘనంగా నిర్వహించారు లంబడి ఐక్య వేదిక జైపాల్ నాయక్ ఆధ్వర్యంలో శ్రీ సేవాలాల్ మహారాజ్ వేడుకలు ఘనంగా జరిగాయి ముఖ్యఅతిథిగా హాజరైన మునిసిపల్ కమిషనర్ గణేష్ రెడ్డి గజ్వేల్ ఇంజనీర్ డివిజన్ ఆఫీసర్ చంద్రం గడప దేవేందర్ పాల్గొన్నారు కార్యక్రమానికి మునిసిపల్ ఆవరణలో ఏర్పాటు చేసిన భోగ్ బండార్ కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే మున్సిపల్ నుంచి ఎమ్మార్వో ఆఫీస్ వరకు శోభాయాత్ర నిర్వహించారు ఇరిగేషన్ డిఈ చంద్రం నాయక్ మాట్లాడుతూ సంత శ్రీ సేవాలాల్ మహారాజ్ ఆశీస్సులు ఒక బంజారా జాతికే కాకుండా యావత్ ప్రజలపై ఉండాలని ఆకాంక్షిస్తూ సేవాలాల్ మహారాజ్ ఎప్పుడు ప్రజల సంక్షేమ కోరుకున్నారని ఆయన మార్గంలో నడుచుకుంటామని తెలిపారు లంబాడి ఐక్యవేదిక మెదక్ జిల్లా అధ్యక్షులు జయపాల్ నాయక్ మాట్లాడుతూ సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ దేశ ఆర్థిక వ్యవస్థను స్వాతంత్రం రాకముందే ఊహించారని అలాగే దేశ రక్షణ కోసం ఎంతో కార్యక్రమాలు చేశారని ఒక బంజారా జాతికే కాకుండా దేశ ప్రజల సంక్షేమం కొరకు ఎన్నో పాటుపడాలని ఒక బంజారా జాతి మంచి మార్గంలో నడవాలని చెడుకు దూరం ఉండి అడవి నుండి వీడి పట్టణాలలో ఉండాలని చదువుల్లో రాణించాలని మంచి స్థాయికి బంజారా జాతి లేదుగాలని కోరేవారిని అలాగే ఆయన అడుగుజాడలో నేను నడుచుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ కిషన్ నాయక్, మాజీ డిఆర్డిఏ ఆఫీసర్ కిషన్ లాల్ నాయక్ సర్వేర్ భాస్కర్ బిక్కు నాయక్ శ్రీనివాస్ నాయక్ సీనియర్ అకౌంటెంట్ తూప్రాన్ మునిసిపల్ నరేష్ నాయక్ వార్డ్ ఆఫీసర్ మున్సిపల్ లైన్ మాన్ భాస్కర్ మహేందర్ శ్రీధర్ నాయక్ రాజు స్వామి అనిల్ పరశురాం బీసీ సంక్షేమం జిల్లా ఉపాధ్యక్షులు మల్లికార్జున గౌడ్ నాగరాజు యాదవ్ జానకిరామ్ శివా నాయక్ తాండ మహిళలు యువకులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
