ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి అక్టోబర్ 4:
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రభుత్వంలో కల్పించిన మౌళిక వసతులను పూర్తిస్థాయిలో వినియోగిస్తూ ప్రజలకు మెరుగైన సేవలందించాలని జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ను మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతం ఆదేశించారు.
మూడుచింతల పల్లిలోని కామిడి వీరారెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం జిల్లా అదనపు కలెక్టరు రాధికా గుప్తాతో కలిసి మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతం పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ కామిడి వీరారెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి భవనం, ఇన్ప్రాస్ట్రక్చర్, సౌకర్యాలు అన్ని బాగున్నాయని, వీటిని వంద శాతం వినియోగించాలని అన్నారు. రోజుకు ఎంత మంది ఓపి పెషంట్లు వస్తారని కలెక్టర్ మెడికల్ ఆఫీసర్ ను అడిగి తెలుసుకున్నారు. ఒపి పెషంట్ల సంఖ్యను పెంచేలా ఆశా వర్కర్లు ఇంటింటికి వెళ్లి అందించే వైద్య సేవల గురించి ప్రజలకు అవగాహాన కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచుంచారు. యూపిహెచ్సిలో ఎంత మంది సిబ్బంది ఉన్నారని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య కేంద్రంలో అందించే వైద్య సేవల రికార్డుల గురించి అడిగి రిజిష్టర్లను పరిశీలించారు. ప్రసవాల సంఖ్య, వ్యాక్సినేషన్, ఇమ్యూనైజేషన్ గురించి అడిగి వాటి నమోదు రిజిష్టర్లను తనిఖీ చేసారు. రిజిష్టర్లలలో ఎప్పటి రికార్డులను అప్పుడే నమోదు చేయాలని రిజిష్టర్లలలో ఖాళీలు ఉండకూడదని సూచించారు. జ్వరాలు ఎక్కువగా విస్తరిస్తున్న సందర్భంగా జ్వరంతో వచ్చే పేషంట్లకు తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించాలని కలెక్టరు సూచించారు.ఈ కార్యక్రమంలో డిఎంఅండ్ హెచ్ఓ రఘునాథస్వామి, మెడికల్ ఆఫీసర్లు, తదితరులు పాల్గొన్నారు.