సర్వే ప్రక్రియ వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి అక్టోబర్ 04 : మంచిర్యాల జిల్లాలో చేపట్టిన ఫ్యామిలీ డిజిటల్ కార్డు పైలెట్ ప్రాజెక్టు సర్వే ప్రక్రియ వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేసే విధంగా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.శుక్రవారం జిల్లాలోని మంచిర్యాల మున్సిపల్ పరిధిలోని 16 వ వార్డు-అశోక్లోడ్లో నిర్వహిస్తున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పైలెట్ ప్రాజెక్టు సర్వే ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలని, ఇందు కొరకు మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్ నియోజకవర్గాలలోని ఒక మున్సిపల్ వార్డు, ఒక గ్రామం చొప్పున ఎంపిక చేసి ప్రక్రియ నిర్వహణ కొరకు నోడల్ అధికారులను నియమించడం జరిగిందని తెలిపారు. సర్వేను సకాలంలో పూర్తి చేసి 9వ తేదీన వివరాలను పరిశీలించి నిర్ణీత ప్రొఫార్మాలో పొందుపరిచి నివేదిక అందించాలని తెలిపారు. ఒక కుటుంబానికి ఒక కార్డు ఉంటుందని, కుటుంబంలోని ప్రతి సభ్యుడికి ఒక ప్రత్యేక నంబర్ కేటాయించడం జరుగుతుందని, ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అన్నింటికీ ఒకే కార్డు అనుసంధానమై ఉంటుందని తెలిపారు. సర్వే ప్రక్రియలో భాగంగా ప్రజలకు ఒకేసారి పూర్తి వివరాలు సేకరించాలని, రేషన్ కార్డుతో సంబంధం లేకుండా అన్ని వర్గాల వారి నుండి వివరాలు సేకరించాలని, కుటుంబంలో వయస్సు రీత్యా పెద్దవారైన మహిళను కుటుంబ పెద్దగా నిర్ణయించి మిగిలిన వారిని ఆ వ్యక్తితో కలిగిన సంబంధంతో సహా వివరాలు నమోదు చేయాలని తెలిపారు.సర్వే బృందాలకు అందించిన జాబితా ప్రకారం పేర్లు, వివరాలు సరి చూసుకోవాలని, మరణించిన వారు, శాశ్వతంగా వేరే ప్రాంతాలకు వెళ్లిపోయిన వారి పేర్లు నిబంధనల ప్రకారం తొలగించాలని తెలిపారు. నూతనంగా వచ్చిన వారి పేర్లు నమోదు చేయాలని,ఉమ్మడి కుటుంబంలో పెళ్లి అయిన వారు ఉంటే వేరుగా నమోదు చేయాలని తెలిపారు. ప్రభుత్వం అందించనున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డు వివిధ సంక్షేమ పథకాలకు ఉపయోగపడుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ మారుతి ప్రసాద్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking