ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇంటింటి సర్వేలో తప్పులు జరుగకుండా పకడ్బందీగా నమోదు చేయాలి జిల్లా కలెక్టర్ గౌతమ్
ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అక్టోబర్ 4:
ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇంటింటి సర్వేలో ఏలాంటి తప్పులు జరుగకుండా పకడ్బందీగా వివరాలను నమోదు చేయాలని మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరు గౌతం పొట్రు అధికారులను ఆదేశించారు.
శుక్రవారం మూడు చింతల పల్లి మండలంలోని పోతారం గ్రామంలో ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇంటింటి సర్వేలో నమోదైన వివరాల నివేదికలను జిల్లా అదనపు కలెక్టరు రాధిక గుప్తా తో కలిసి కలెక్టరు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ సర్వేలో కుటుంబాల వివరాలను తప్పులు దొర్లకుండా పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా సర్వేలో కుటుంబాల వివరాలను పారద్శకంగా సేకరించాలని సూచించారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మహిళలను యజమానులుగా నమోదు చేయాలన్నారు. అనంతరం గ్రామస్తులు గ్రామంలోని కొన్ని సమస్యలను తీర్చాలని కలెక్టరుకు అర్జీలను అందజేసారు. కలెక్టరు సానుకూలంగా స్పందిస్తూ వారి సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు.ఈ పర్యటనలో ఆర్డిఓ ఉపేందర్ రెడ్డి, డిపిఓ వెంకయ్య, తదితరులు పాల్గొన్నారు.