ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 02 : ప్రభుత్వ ఆసుపత్రులు,ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.బుధవారం జిల్లా కేంద్రంలోని రాజీవ్నగర్లో గల పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి వార్డులు,ల్యాబ్,మందుల నిల్వలు,రిజిస్టర్లు,పరిసరాలను పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…వివిధ అనారోగ్య సమస్యలపై ఆసుపత్రులకు వచ్చే ప్రజలతో మర్యాదగా వ్యవహరిస్తూ మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలిపారు.అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలని,వైద్యులు, సిబ్బంది విధుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని,ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రజలకు వైద్య సేవలు అందించాలని తెలిపారు.ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా అధికారులు పర్యవేక్షించాలని, వేసవికాలం అయినందున వడదెబ్బ నుండి కాపాడుకునేందుకు పాటించవలసిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking