ఇందిరా మహిళా శక్తి లక్ష్యాలను సాధించాలి

 

-మహిళా సాధికారతకు తోడ్పాటు అవసరం

-డి ఆర్ డి ఓ కిషన్

ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ ఏప్రిల్ 2

మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఇందిరా మహిళా శక్తి లక్ష్యాలను సాధించాలని టి ఆర్ డి ఓ కిషన్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని జిల్లా సమాఖ్య కార్యాలయంలో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఆర్థిక సంవత్సరం 2024 – 25 వ ఆర్థిక సంవత్సరంకు గాను స్త్రీనిధి రుణాల లక్ష్యాలను సాధించినందుకు అలాగే తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లించినందుకు గాను జిల్లాలో గల ఏడు మున్సిపాలిటీలలో మందమర్రి మున్సిపాలిటీకి స్త్రీనిధి ఉత్తమ అవార్డుకు ఎంపికవడం సంతోసమన్నారు. ఈ అవార్డును మందమర్రి పట్టణ సమాఖ్య పదాధికారులైన సంధ్య, రాధ, మెప్మా టిఎంసి రఘురాం లకు ఆయన ఘనంగా సత్కరించి మెమోంటో అందించారు. మెప్మా లో ఆర్ పి ల పని తీరు వల్లనే ఇది సాధ్యమైందన్నారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని ఈ అవార్డ్ వచ్చేందుకు కృషి చేసిన పడదికారులను మెప్మా టీ. ఏం.సీ రఘు రాం ను ఆయన అభినందించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా మహిళలను అన్ని రంగాల్లో ముందుకు రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్త్రీ నిధి రీజినల్ మేనేజర్ వెంకటరమణ, సంస్థాగత నిపుణురాలు స్వర్ణలత, ఏపిఎం లు జిల్లా సమాఖ్య పదాధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking