ఏకకాలంలో పన్ను చెల్లించి రాయితీ పొందండి

 

-మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు

ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ ఏప్రిల్ 2:

మందమర్రి పట్టణ ప్రజలు 2025-26 ఆర్ధిక సంవత్సరమునకు సంబంధించిన ఆస్తి పన్నులు ముందస్తుగా ఏక మొత్తములో చెల్లింపు చేసిన వారికి తెలంగాణ పురపాలక చట్టం 2019 సెక్షన్ 100(1) ప్రకారం ఆస్తి పన్నులో 5% రాయితీని కల్పించటం జరిగిందని మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇట్టి సదవకాశము కేవలము 30.04.2025 వరకు మాత్రమే కలదని పట్టణ ప్రజలు ఈ అవకాశమును వినియోగించుకొని మీ వద్దకు వస్తున్నటువంటి వార్డు అధికారి లేదా బిల్ కలెక్టర్ వద్ద చెల్లింపు చేయాలని ఆయన తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking