అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని

 

👉ముగ్గురు పిల్లల్ని ఊపిరాడకుండా చేసి చంపిన కన్నా తల్లి
👉 పోలీసుల అదుపులో హంతకురాలు రజిత(లావణ్య,)ప్రియుడు సూరు శివ కుమార్.
👉 వివరాలు వెల్లడించిన: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపియస్.

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 02(ప్రజాబలం)సంగారెడ్డి జిల్లా/సంగారెడ్డి: జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ నందు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపియస్.మాట్లాడుతూ.. రజిత (లావణ్య)కు ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం చదువుతున్న సమయం (2013)లో తనకన్నా వయస్సులో 20 సంవత్సరాలు పెద్ద వాడైన అవురిచింతల చెన్నయ్య తండ్రి లేట్ రామయ్యతో వివాహ జరిగింది. వీరికి ముగ్గురు (1. ఏ. సాయి కృష్ణ, వయస్సు: 12 సం,లు, 2. ఏ. మధుప్రియ, వయస్సు: 10 సం,లు, 3. ఏ. గౌతమ్, వయస్సు: 8 సం,లు) పిల్లల సంతానం కలదు. వీరి స్వస్థలం మెధక్ పల్లి గ్రామం, తలకొండపల్లి మండల్, రంగారెడ్డి జిల్లా. గత 3-సంవత్సరాల క్రితం అమీన్పూర్ గ్రామం, బీరంగూఢ, రాఘవేంద్ర కాలనీలో నివాసం ఉంటూ చెన్నయ్య వాటర్ ట్యాంకర్ డ్రైవర్ గా, రజిత (లావణ్య) ప్రైవేట్ స్కూల్ టీచర్ గా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు,సుమారు 6 నెలల క్రితం రజిత ( లావణ్య ) 10వ తరగతి క్లాస్మేట్స్ అందరూ కలిసి పార్టీ జరుపుకుందామని ప్లాన్ చేసుకుంటున్న సమయంలో తన 10వ తరగతి క్లాస్ మేట్ అయిన శివతో స్నేహం మరితగా ఏర్పడి రోజు చాటింగ్, కాల్స్, వీడియో కాల్స్ మాట్లాడేవారు. చాలా సార్లు శారీరకంగా కూడా కలవడం జరిగింది.రజిత(లావణ్య)కు, చెన్నయ్యకు ఎక్కువ ఏజ్ గ్యాప్ ఉండడం వల్ల మొదటి నుండే రజితకు చెన్నయ్య అంటే ఇష్టం ఉండేధి కాదు. తరచూ గొడవలు పడేవారు. శివ కలిసినప్పటి నుండి రజిత జీవితం ఆనందంగా ఉందని, శివకు పెళ్లి కాకపోవడంతో ఎలాగైనా అతన్ని పెళ్లి చేసుకుని జీవితాంతం సుఖంగా ఉండాలని అనుకొని, పెళ్లి చేసుకోమని శివను ఆడగగా ఒకవేళ రజితకు పెళ్లి కాకపోయి ఉంటే, పిల్లలు లేకుంటే ఉంటే ఒంటరీగా తనతో వస్తా అంటే ఖచ్ఛితంతా పెళ్లి చేసుకుంటా అని చెప్పడంతో, శివ ను పెళ్లి చేసుకోవాలంటే పిల్లల అడ్డు తొలగించుకోవాల్సిందే అని నిర్ణయించుకొని, తేదీ: 27.03.2025 సాయంత్రం 6:గంటలకు పిల్లలను చంపేస్తాను అని శివకు చెప్పగా ఆ పనిని త్వరగా పూర్తి చేయమని అనడంతో అదే రోజు రాత్రి తన భర్త భోజనం చేసి రాత్రి 10.00 గంటలకి ట్యాంకర్ తీసుకొని చందానగర్ వెళ్ళగా అదే మంచి సమయం అని భావించి, మొదటగా పెద్ద కొడుకు సాయికృష్ణ ను, కూతురు మధుప్రియ ఆతర్వాత చిన్న కొడుకుని గౌతమ్ ను ఇలా ముగ్గురిని ఒకరి తరువాత ఒకరిని ముక్కు, మూతిపై టవల్ వేసి, చేతితో గట్టిగా అధిమి పట్టుకొని, ఊపిరాడకుండా చేసి, చంపివేసినట్లు విచారణలో తేలింది.ఏ-1, ఏ-2 లు కుట్ర పన్ని పిల్లల్ని అడ్డు తొలగించుకోవాలని ఏ-2 ప్రొత్సహించగా ఏ-1 అత్యంత కిరాతకంగా ముగ్గురు పిల్లలను ఊపిరాడకుండా చేసి చంపివేసిందని, నిందితులిద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని, రిమాండుకు తరలించడం జరుగుతుంది అన్నారు.నిందితుల వివరాలు: ఏ1: రజిత(లావణ్య)కు భర్త చెన్నయ్య, వయస్సు: 30 సంవత్సరాలు, వృత్త: ప్రైవేట్ స్కూల్ టీచర్, నివాసం రాఘవేంద్ర కాలనీ, బీరంగూడ గ్రామం, అమీన్పూర్ మండలం, స్వస్థలం మెధక్ పల్లి గ్రామం, తలకొండపల్లి మండల్, రంగారెడ్డి జిల్లా.ఏ1: సూరు శివ కుమార్ తండ్రి రాములు, వయస్సు: 30 సంవత్సరాలు, వృత్తి: ప్రైవేట్ ఉద్యోగి, నివాసం: గోడుకొండ్ల గ్రామం, చింతపలి మండలం, నల్గొండ జిల్లా,ఈ ప్రెస్ మీట్ నందు పటాన్ చెర్వు డియస్పీ రవీందర్ రెడ్డి, అమీన్పూర్ ఇన్స్పెక్టర్ నరేష్, పటాన్చెర్వు డిఐ రాజు ఇన్స్పెక్టర్, అమీన్పూర్ ఎస్ఐలు సోమేశ్వరి తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking