మణికొండలో శునకాల బెడద తప్పదా

రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజాబలం ప్రతినిధి 03 ఏప్రిల్ 2025
గుడ్ మార్నింగ్ మణికొండ లో భాగంగా గురువారం రోజున బీ.ఆర్.ఎస్ నాయకులు ప్రజాభిప్రాయ సేకరణ నిమిత్తం సాయిరాం కాలనీలో సందర్శించడం జరిగినదనీ అప్పుడు స్థానిక ప్రజలు వారి ఇతిబాదలు తెలియచేస్తూ ముఖ్యంగా పై నున్న అన్ని కాలనీలకు సంబంధించిన డ్రైనేజ్ మొత్తంగా వచ్చి సాయిరామ్ కాలనీ వద్ద కలుసుకొని ముందుకు సాగుతుంన్నందు వలన ప్రతీ ఇంటి వారు వారం వారం పని కట్టుకొని డ్రైనేజ్ క్లీన్ చేయించు కొవలసి వస్తున్నదని వాపోయారు. వీధి దీపాలు గత చాలా రోజులుగా వెలుగడం లేదని పర్యవసానంగా వయోజనులు చీకట్లో క్రింద పడడం కూడా జరిగినవని, ఈ విషయమై విద్యుత్శక్తి అధికారులకు ఎన్నోసార్లు పిర్యాదు చేసినను ప్రయోజనం లేదని తెలియ జేసినారు. వీధి కుక్కల బెడద తీవ్రంగా ఎదుర్కుంటున్నామని ఆ విషయమై నేడు పసి బాలికపై వీధి కుక్కలు దాడి చేయబోగా ప్రత్యక్షంగా చూడడం బాలికను కాపాడడం జరిగినదనీ తెలియ పరచినారు. ఎండా కాలం రాక ముందు నుండే నీటి ఎద్దడి మొదలైందని, వేళా పాలా లేకుండా కేవలం అరగంట సేపు మాత్రమే మంచి నీటి సరఫరా అవుతుందని స్థానిక ప్రజలు తెలిపారు. మున్సిపల్ అధికారులు వీదులను శుభ్ర పరచడానికి సఫాయి కర్మచారులను వారం రోజులకు ఒక మారు పంపడం వలన వీధి మొత్తంగా చెత్తతో నిండి ఉంటున్నదని అన్నారు. ఎగుడు దిగుడు రహదారులతో ద్విచక్ర వాహన దారులు ఢీకొట్టుకుంటున్నారని తెలిపారు.
సంబంధిత అధికారులు స్పందించి స్థానికుల మొర ఆలకించి ప్రజా సౌకర్యార్థం పనులు సక్రమముగా చేయాలని బీ.ఆర్.ఎస్ నాయకులు గుట్టమీది నరేందర్, బుద్ధోలు బాబు, మల్యాద్రి నాయుడు, శ్రీనివాస్ చారి, సంఘం శ్రీకాంత్, కిరణ్ యాలాల, బండమీది మల్లేష్, భాను చందర్, సుమనళిని, బొడ్డు శ్రీధర్, చెరుకూరి బాలాజీ, రమణ మూర్తి, రాజు, మహేష్ తది తరులు డిమాండ్ చేస్తూన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking