కామారెడ్డి 15. Mlc కల్వకుంట్ల కవితపై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను నిరసిస్తూ ఈ రోజు భారత జాగృతి ఆధ్వర్యంలో నిజాం సాగర్ చౌరస్తా కానిస్టేబుల్ కిష్టయ్య విగ్రహం వద్ద నిరసన
కార్యక్రమం జరిగింది , ఈ సంధర్భంగా భారత జాగృతి కామారెడ్డి జిల్లా అధ్యక్షులు చిట్టిమల్ల అనంత రాములు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకొని దర్యాప్తు సంస్థలను తమ జేబు సంస్థగా మారుస్తూ తమకు అనుకూలంగా లేని వారిపై కక్షసాధింపు చేర్యలకు పాల్పడుతున్నదని , ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని , రాష్ట్రంలో బా జా పా బలహీన పడిన ప్రతీసారి దర్యాప్తు సంస్థలను అప్రమత్తం చేసి కక్ష సాధిస్తున్నారని , ఇలాంటి తాటాకు చప్పుళ్లకు మా అధినేత్రి కవిత బెదిరే ప్రసక్తే లేదని ఆయన అన్నారు …
నిరసన తెలుపుతూ ప్లకార్డులు ప్రదర్శించారు .ఈ కార్యక్రమంలో ఆవునూరి రమణారావు , తోట వంశీ , చక్రధర్ కులకర్ణి , శ్రీ రాం వెంకటేష్ , కామటి శేఖర్ స్వామి గౌడ్ , సాయి , ఆవుసుల రాజు , లలిత
ఈరం రవి బోధస్ నరేష్ బోట్ల రాజు
తదితరులు పాల్గొన్నారు ..