ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 15 : రక్త పరీక్షలు ఆరోగ్య స్థితిని తెలుసుకోవడానికి ఎంతో అవసరమని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జై కిషన్ ఓజా అన్నారు. శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ ఆదర్శ డిగ్రీ కళాశాలలో జంతు శాస్త్ర విభాగం రెడ్ రిబ్బన్ క్లబ్ ఆధ్వర్యంలో స్నేహ ఫౌండేషన్ సహకారంతో విద్యార్థులకు రక్తంలో ఇన్ఫెక్షన్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ…రక్తంలోని ఇన్ఫెక్షన్ గురించి తెలుసుకోవడం వలన రోగాలను తెలుసుకోవచ్చన్నారు.రక్త దానం చేయడంతో కూడా మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చన్నారు.ఒక చుక్క రక్తంతో ఎన్నో రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసుకోవచ్చ న్నారు. అంతకుముందు జంతు శాస్త్ర విభాగాధిపతి మరియు ఆర్ ఆర్ సీ సమన్వయకర్త డాక్టర్ చంద్ర శేఖర్ మాట్లాడుతూ… విద్యార్థులు రక్త గ్రూప్ లు తెలుసుకోవడం,ఇన్ఫెక్షన్ ల వలన కలిగే అనర్ధాలను తెలియజేయడానికే ఈ శిభిరం ఏర్పాటు చేశామన్నారు.ప్రతి విద్యార్థి రక్తం యొక్క ప్రాముఖ్యతను గుర్తించాలన్నారు. అనంతరం సుమారు 150 మంది విద్యార్థులు రక్త ఇన్ఫెక్షన్ పరీక్షలు చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు అరుణ కుమారి,బోనగిరి కుమార్, కవిత,రాజా కుమార్,స్నేహ ఫౌండేషన్ నిర్వాహకులు లత,కళ్యాణ్, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.