మోడీ ప్రభుత్వం 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ హైదరాబాద్‌ సెంట్రల్‌ జిల్లా సమావేశం

అంబర్‌పేట్‌ ప్రజాబలం ప్రతినిధి:భారతీయ జనతా పార్టీ హైదరాబాద్‌ సెంట్రల్‌ జిల్లా ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పాటు చేసి 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతి డివిజన్లో నిర్వహించాల్సిన కార్యక్రమాల పైన జిల్లా కార్యక్రమాల కన్వీనర్‌ ఏడెల్లి అజయ్‌ కుమార్‌ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా కార్యాశాల కార్యక్రమాలకి రాష్ట్ర పార్టీ తరఫున ముఖ్యఅతిథిగా
డాక్టర్‌ ఎన్‌.గౌతమ్‌ రావు విచ్చేసి జూన్‌ 9 నుంచి జూన్‌ 25 ఎమర్జెన్సీ రోజు వరకు పార్టీ చేపట్టాల్సినటువంటి కార్యక్రమాల పైన వివరంగా చర్చించడం జరిగింది డివిజన్లలో సంకల్ప సభలు, శక్తి కేంద్రాల వారిగా రచ్చబండలు,జిల్లా స్థాయిలో ప్రొఫెషనల్‌ మీట్‌, డిజిటల్‌ ప్లాట్‌ ఫామ్స్‌ పైన (మై గావ్‌ పోర్టల్‌ లో) ఏడిటోరియల్స్‌ బ్లాక్స్‌, వివిధ రకాల పోటీలను నిర్వహించాలని ఎమర్జెన్సీ విషయంలో నేటి యువతకు తెలియజేసే విధంగా ప్రతి డివిజన్‌ లో పెద్ద ఎత్తున సభలు నిర్వహించాలని ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి పోలింగ్‌ బూత్‌ లో మొక్కలు నాటే విధంగా చర్యలు చేపట్టాలని జూన్‌ 23న డాక్టర్‌ శ్యాం ప్రసాద్‌ ముఖర్జీ బలిదాన్‌ దివస్‌ దివస్ను పురస్కరించుకొని ప్రతి డివిజన్లో పోలింగ్‌ బూతుల వారిగా కార్యక్రమాన్ని నిర్వహించాలని తెలియజేయడం జరిగింది ఇంకా అనేక విషయాల పైన కులం కుశంగా కార్యశాలలో చర్చించడం జరిగింది ఈ సమావేశంలో పాల్గొన్న నాయకులు మాజీ మంత్రి సి.కృష్ణ యాదవ్‌, హైదరాబాద్‌ సెంట్రల్‌ జిల్లా బిజెపి అధ్యక్షులు లంకల దీపక్‌ రెడ్డి, రాష్ట్ర బిజెపి అధికార ప్రతినిధి ఎన్‌ వి సుభాష్‌, రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షులు జి ఆనంద్‌ గౌడ్‌, నందకిషోర్‌ యాదవ్‌,
సి.కృష్ణ గౌడ్‌ కార్పొరేటర్‌ ఉమా రమేష్‌ యాదవ్‌, బుజేందర్‌ కుమార్‌, పి ప్రసాద్‌, ప్రేమ్‌ కుమార్‌, రాఘవరెడ్డి ఇంకా సెంట్రల్‌ హైదరాబాద్‌ జిల్లాలో ఉన్న డివిజన్‌ బిజెపి అధ్యక్షులు, జిల్లా బిజెపి పదాధికారు నియమించిన కమిటీల సభ్యులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking