సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి
మహేష్ కుమార్ గౌడ్
నాంపల్లి గాంధీభవన్ ప్రజాబలం ప్రతినిధి:గాంధీ భవన్‌లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశం
టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగినది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ , మంత్రి పొన్నం ప్రభాకర్
విప్ అది శ్రీనివాస్, ఎమ్మెల్సీ బలమురి వెంకట్, ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షులు కవంపల్లి సత్యనారాయణ, సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి
తదితరులు పాల్గోన్నారు.ఈ సందర్భంగా
టీపిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సి మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ
మచ్చలేని వ్యక్తి మీనాక్షి నటరాజన్ ఇంచార్జీ గా రావడం శుభ సూచకం
పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించాలి
అధికారంలో ఉన్నపుడు రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తే పార్టీ మరోసారి అధికారంలోకి వస్తుంది
బూత్ స్థాయి నుంచి పార్టీ నిర్మాణం జరగాలి
సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత మనపై ఉంది
ఉచిత బస్సు నుంచి సన్న బియ్యం వరకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టడం జరిగింది
కార్యకర్తలలోని నిరాశను తొలగించేందుకు సమన్వయం చేయాలి
ఉద్యోగాలు, వైద్యం, విద్యపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది
ప్రభుత్వ పనితీరుకు తగిన ప్రచారం రావడం లేదు
జూన్‌లో పీసీసీ కార్యవర్గం, మంత్రి వర్గ విస్తరణకు అవకాశం
కొంత మంది ఎమ్మెల్యేలు తమ పనితీరును సమీక్షించుకోవాలి
దేశానికి తెలంగాణ రోల్ మోడల్
స్థానిక ఎన్నికల్లో మెరుగైన ఫలితాల కోసం ఎమ్మెల్యేలు కృషి చేయాలి
శాస్త్రీయంగా కులసర్వే చేపట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది
బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీదే
చిన్న చిన్న సమస్యలు ఉన్నా పరిష్కారానికి కృషి కొనసాగుతుంది
Prev Post