ఈటల ఇంకా బీఆర్‌ఎస్‌ లోనే ఉన్నట్లుంది

ప్రధాని మోదీ, అమిత్‌ షా, నడ్డాలు అబద్దాలు చెప్పారా
ఈటల వ్యాఖ్యలపై టీపిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్‌ కుమార్‌ గౌడ్‌
నాంపల్లి గాంధీభవన్‌ ప్రజాబలం ప్రతినిధి: కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి సంబంధించి విచారణ అనంతరం ఈటల వ్యాఖ్యలను చూశాక ఆశ్చర్యమేసింది
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కేసీఆర్‌ తప్పేమీ లేదన్నట్లుగా, అంతా కేబినెట్‌ నిర్ణయం మేరకే జరిగిందని ఈటల రాజేందర్‌ బుకాయిస్తున్నారు
ఆర్ధిక మంత్రిగా ఉన్న వ్యక్తి ప్రాజెక్టు నిధులతో తనకు సంబంధమే లేదని అనడం హాస్యాస్పదం
దేశమంతా కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని కోడై కూసింది
ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమిత్‌ షా, జేపీ నడ్డా అనేక సార్లు ‘‘కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్‌ కుటుంబానికి ఏటీఎంలా మారింది. వేల కోట్ల అవినీతి జరిగింది’’అని ఆరోపణలు చేశారు.
కానీ ఈటల రాజేందర్‌ అందుకు భిన్నంగా ఈరోజు కమిషన్‌ ఎదుట ఇచ్చిన వివరణను చూస్తే ఈటల రాజేందర్‌ కేసీఆర్‌ తో కుమ్కక్కైనట్లు స్పష్టమైంది
కాళేశ్వరంలో ఈటలకు కూడా వాటాలు ముట్టినందునే కేసీఆర్‌ కు అనుకూలంగా మాట్లాడిరడు
ఈటల మాత్రం కేసిఆర్‌ కుటుంబం అవినీతిపై పల్లెత్తు మాట కూడా విచారణ కమిషన్‌ ఎదుట చెప్పలేదు?
ప్రజల నుండి, రైతుల నుండి వచ్చిన ఒత్తిళ్ల మేరకే కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలను పెంచినట్లు ఈటల చెప్పడం చూస్తుంటే ఆశ్చర్యమేస్తోంది?
ఈటల ఇంకా బీఆర్‌ఎస్‌ లోనే ఉన్నట్లుంది
కేసీఆర్‌ ను కాపాడేందుకు పూర్తిగా వకల్తా పుచ్చుకుని వివరణ ఇచ్చినట్లు ఈటల మాటల ద్వారా కన్పిస్తోంది.
పక్కా ప్రీ ప్లాన్‌ ప్రకారం కేసీఆర్‌, హరీష్‌ రావు, ఈటల రాజేందర్‌ కూడబలుక్కుని ఒక్కటే సమాధానాలు చెప్పాలని, అవినీతి జరగలేదని బుకాయించేందుకు సిద్ధమై వచ్చి పచ్చి అబద్దాలు వల్లిస్తుండు
విచారణ అనంతరం ఈటల వ్యాఖ్యలతో…ఆయన
హరీష్‌ రావుతో రహస్యంగా భేటీ అయ్యారని నేను చెప్పిన మాటలు నిజమని తేలింది
అంతా కేబినెట్‌ నిర్ణయం మేరకే జరిగిందంటున్నడు.
టెక్నికల్‌ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే ప్రాజెక్టు కట్టారని చెబుతున్నడు. ఇంకా ఆశ్చర్యమేందంటే ప్రజల నుండి, రైతుల నుండి వచ్చిన ఒత్తిళ్ల మేరకే ప్రాజెక్టు అంచనాలను పెంచారని చెబుతున్నడు. సిగ్గుండాలే… రైతులకు, కాళేశ్వరం అంచనాలతో ఏం సంబంధం? మీ అవినీతిని రైతులపై రుద్దాలనుకుంటున్నారా?
కాళేశ్వరంలో వేల కోట్ల అవినీతి జరిగిందని మొత్తుకున్న బీజేపీ నాయకులు ఇప్పుడే ముఖం పెట్టుకుని మాట్లాడతారు?
కాళేశ్వరం కేటీఆర్‌ కుటుంబానికి ఏటీఎంలా మారిందని పదేపదే ప్రచారం చేసిన ప్రధాని మోదీ, అమిత్‌ షా, నడ్డా ఇప్పుడేమంటారు? ఈటలతోపాటు మీకు కూడా కాళేశ్వరం కమిషన్లు అందినయా?
బీఆర్‌ఎస్‌ తో బీజేపీకి ఉన్న లోపాయికారీ ఒప్పందం మేరకే కేసీఆర్‌ ను కాపాడేందుకు ఈటలతో వివరణ ఇప్పించారా?
బీజేపీ నాయకత్వం సమాధానం చెప్పాలి. లేకుంటే ప్రధాని మోదీసహా బీజేపీ పెద్దలకు కూడా వాటాలు ముట్టినట్లేనని, బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒక్కటేననే నిజమేనని ప్రజలంతా భావించాల్సి వస్తుంది
కాళేశ్వరం విషయంలో బీజేపీ తన పంథా మార్చుకుందా? ఈటల ఇచ్చిన వివరణ ఆయన సొంతమా? లేక బీజేపీ విధానమా?
కాళేశ్వరంలో అవినీతి జరిగిందని బీజేపీ చెబుతుంటే… అసలు అవినీతే జరగలేదని మాట్లాడుతున్న ఈటల రాజేందర్‌ పై చర్యలు తీసుకునే దమ్ముందా? అట్లాగే కాళేశ్వరంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించేందుకు సిద్దమా?

Leave A Reply

Your email address will not be published.

Breaking