👉 ఆందోల్ -జోగిపేట ఆర్డీవో పాండు
ఆందోల్ నియోజకవర్గం ప్రతినిధి ( జూన్ 6 ప్రజాబలం ) సంగారెడ్డి జిల్లా, భూభారతి చట్టం ద్వారా ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న, భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, అందోల్- జోగిపేట్ ఆర్డిఓ పాండు అన్నారు, రెవెన్యూ సదస్సులో భాగంగా చౌటకూర్ మండలం సరాప్ పల్లి,గ్రామంలో నిర్వహించిన సదస్సుకు ఆయన హాజరయ్యారు, భూ సమస్యల విషయాలను, పూర్తి చేసేందుకు, ప్రత్యేకంగా దరఖాస్తులను రూపొందించినట్లు తెలిపారు, పట్టా, ఇనాం, లావని పట్టా, సీలింగ్ ప్రభుత్వ భూదాన్, పోడు భూములకు సంబంధించి పెండింగ్ లో ఉన్న రైతులు, దరఖాస్తులు చేసుకోవచ్చు అన్నారు, భూమి సంక్రమించిన విధానంలో, వారసత్వం, బాగా పంపకాలు, సాదాబైనామా కొనుగోలు, రిజిస్టర్ కొనుగోలు, దానం, బహుమతి, ఓఆర్పి అసైన్మెంట్ కోర్టు ఉత్తర్వులు, 38, ఇటువంటి వివరాలను పొందుపరచాలని, ఆయన సూచించారు, అనేక రోజులుగా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో, అవస్థలు పడ్డారని పేర్కొన్నారు, ఈనెల 11వ తేదీ వరకు, రెవెన్యూ సదస్సులు జరుగుతాయని, రైతులు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు, దీంతోపాటు పుల్కల్ మండలంలోని, పోచారం బస్వాపూర్ గ్రామంలో నిర్వహించిన, రెవెన్యూ సదస్సుల్లో తహసిల్దార్ కృష్ణ పాల్గొని, దరఖాస్తులు స్వీకరించాలని, ఈ కార్యక్రమంలో తాసిల్దార్ సంధ్య రాణి, నాయబ్ తాసిల్దార్, శ్రీనివాస్ గౌడ్, సిబ్బంది పాల్గొన్నారు…..