తెలంగాణా కాంగ్రెస్ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్
నాంపల్లి గాంధీభవన్ ప్రజాబలం ప్రతినిధి:గాంధీభవన్‌లో మహబూబ్‌నగర్ పార్లమెంట్ సమీక్ష సమావేశం
టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన సమావేశం
ముఖ్య అతిథిగా ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కీలక నాయకులు హాజరు
ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ మట్లాడుతూ
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లాలి
పథకాల ప్రభావం క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనిపిస్తుంది
ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని రాబోయే ఎన్నికల్లో అనుకూలతగా మలచుకోవాలి
పార్టీ నేతలంతా సమన్వయంతో పనిచేయాలి
టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మట్లాడుతూ
ప్రభుత్వ పథకాలను ప్రజలకు సూటిగా వివరించండి
సీనియర్లు – జూనియర్లు సమన్వయంతో ముందుకెళ్లాలి

స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేయండి.అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జులు ఎమ్మెల్యేలు,ప్రజాప్రతినిధులు స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజాసమస్యలు దృష్ఠికి తీసుకువచ్చినపుడు సమస్యలు పరిష్కారమయ్యే దిశగా ప్రజాప్రతినిధులు పనిచేయాలి.
దేశాన్ని ఆశ్చర్యపరిచే విధంగా పథకాలు అమలవుతున్నాయి
కుల సర్వే, ఎస్సీ వర్గీకరణ, సన్న బియ్యం పంపిణీ, భూ భారతి పట్ల ప్రజల్లో సానుకూల స్పందన ఉచిత విద్యుత్ మహిళలకు ఉచిత బస్సు మొదలగు కార్యక్రమాలని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రజలలోకి తీసుకెళ్ళాల్సిన అవసరం ఉన్నది అని అన్నారు.ఈ కార్యక్రమంలో మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజక వర్గ కాంగ్రెస్ నాయకులు పాల్గోన్నారు.కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ నాయకులు గోషామహల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అబ్జర్వర్ వినోద్ కూమార్ ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ను మర్యాద పూర్వకంగా కలవడం జరిగినది.