శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌ ను కలిసిన కోదండరెడ్డి.

రెండు అంశాలపై కేంద్ర మంత్రికి ప్రతిపాదన లేఖలు ఇచ్చిన కోదండరెడ్డి
ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలనీ, మైనర్‌ ఇరిగేషన్కు కేంద్ర నిధులు కేటాయించాలని కోరిన రైతు కమిషన్‌ చైర్మన్‌.
తెలంగాణ గోలుకట్టు చెరువులకు నిలయమని, రాష్ట్రంలో 45 వేల చెరువులు ఉన్నాయని.. వాటి మరమ్మతులు, నిర్వహణకు ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు.
ఇతర రాష్ట్రాల్లోని చెరువుల అభివృద్ధికి కేంద్రం నిధులు కేటాయిస్తున్న విషయాన్నీ గుర్తుచేశారు.
వ్యవసాయ రంగంలో కూలీల కొరత తీవ్రంగా ఉందని, ఉపాధి హామీ పథకాన్ని అగ్రికల్చర్‌ కు లింక్‌ చేస్తే.. వ్యవసాయ రంగం మరింత పురోగతి చెందుతుందన్నారు.
ఇబ్రహీంపట్నం మండలం మంగళ్‌ పల్లి గ్రామంలో జరిగిన విక్షిత్‌ కృషి సంకల్ప్‌ అభియాన్‌ కార్యక్రమంలో కేంద్రమంత్రి తో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు, రైతు కమిషన్‌ చైర్మన్‌ కోదండరెడ్డి.

Leave A Reply

Your email address will not be published.

Breaking