భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ క్యాంప్ కార్యాలయం ప్రారంభం

 

ఖమ్మం ప్రతినిధి జనవరి 03 (ప్రజాబలం) ఖమ్మం గొల్లగూడెం రోడ్డు సత్యసాయి నగర్ రోడ్ నెంబర్ 7 నందు నూతనంగా భారతీయ జనతా పార్టీ ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం క్యాంప్ కార్యాలయమును రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈవి రమేష్ మరియు వారి కుటుంబ సభ్యులు బిజెపి నాయకులు , కార్యకర్తలు తో కలిసి ప్రారంభించారు . అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈవి రమేష్ మాట్లాడుతూ ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థిగా పోటీ చేయాలని ఆశాభావంతో ప్రచారానికి ప్రారంభించి కొంతమంది ముఖ్య నాయకులను కలుసుకుంటున్నారని ఈ సందర్భంగా పేర్కొన్నారు . దేశంలో ప్రతి ఒక్కరికి మరోసారి మోడీ సర్కార్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని అన్నారు . రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత పథకాలను , ప్రాజెక్టులను ఆర్థిక దుర్వినియోగం చేస్తూ ఉంటే కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణతో దేశంలోని అన్ని రాష్ట్రాలు , గ్రామాలు , పట్టణాలు , నగరాలు అన్నిటికీ ఆర్థిక సహాయని ప్రాజెక్టులను ఇస్తూ వాటిని ప్రతిష్టంగా దేశంలో ఉండే విధంగా రక్షణ పరంగా పాలన కొనసాగిస్తుందని మోడీ నాయకత్వంలో ప్రపంచంలోనే విశ్వ గురువుగా కొనియాడ బడుతూ దేశ ప్రతిష్టను బలపరుస్తుందన్నారు . ఈ కార్యక్రమంలో బిజెపి ఖమ్మం కన్వీనర్ అల్లిక అంజయ్య , కొత్తగూడెం కన్వీనర్ నరేంద్రబాబు , ఓబిసి మోర్చా నాయకులు ఆకుల నాగేశ్వరరావు భారతీయ జనతా పార్టీ మహిళ ఉపాధ్యక్షురాలు మంద సరస్వతి లీగల్ సెల్ అధ్యక్షులు కొలీపాక శ్రీదేవి చంద్రశేఖర్ మోహన్ రెడ్డి పిల్లల మర్రి వెంకట్ నారాయణ డాక్టర్ జి వెంకటేశ్వర్లు , మార్తి ప్రసాద్ సుధాకర్ శ్రీనివాస్ నరేంద్రబాబు రవీందర్ జ్వాల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking