అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబాలకు సంక్షేమ ఫలాలూన్ అందేలా చర్యలు: జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య

 

వరంగల్ ప్రజాబలం ప్రతినిధి జనవరి 3:

అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబాలకు సంక్షేమ ఫలాలూన్ అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమన్నీ అర్హత గల అన్ని కుటుంబాలు సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ జిల్లా కలెక్టర్
పి ప్రావిణ్య అన్నారు.
బుధవారం వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కడారిగూడెం గ్రామంలో నిర్వహిస్తున్న ప్రజా పాలన కార్యక్రమం
అభయహస్తంలో ప్రజల 5 గ్యారెంటీల దరఖాస్తుల స్వీకరణను జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పరిశీలించి పటిష్టంగా నిర్వహించుటకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అర్హులందరూ దరఖాస్తులు చేసుకునేలా చూడాలని అధికారులకు సూచించారు.
ప్రభుత్వ పథకాలు లబ్ధి పొందడానికి ఒక కుటుంబాన్ని నుంచి ఒక దరఖాస్తు సరిపోతుందని ఐదు గ్యారంటీలను అమలు చేసి ప్రతి ఇంటికి చేరే విదంగా చర్యలు చేపడుతామని తెలిపారు.
దరఖాస్తులు పూరించడానికి, ప్రభుత్వ పథకాలు గురించి ప్రజలకు వివరించడానికి ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి ప్రభుత్వ అధికారులు సిబ్బంది సహకారిస్తూన్నారని కలెక్టర్ పేర్కొన్నారు లబ్ధిదారులు దరఖాస్తు తో పాటు ఆధార్ కార్డు రేషన్ కార్డ్ జిరాక్స్ జతపరచాలని దరఖాస్తుదారునికి తప్పనిసరిగా రసీదు అందించడం జరుగుతుందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో నర్సంపేట ప్రత్యేక అధికారి వరంగల్ ఆర్డిఓ వాసు చంద్ర సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking