ప్రజా పాలన సభలకు భారీ స్పందన .

ఆరు గ్యారెంటీ పథకాలు లబ్ధికి దరఖాస్తుల వెలువ.
కాలకల్ గ్రామ సర్పంచ్
నత్తి మల్లేష్ ముదిరాజ్.

మెదక్ మనోహరాబాద్ జనవరి3 ప్రాజబలం న్యూస్ :-

రాష్ట్ర ప్రభుత్వం అభయ హస్తం కార్యక్రమం ద్వారా అమలు చేసిన ఆరు గ్యారంటీ పథకాల లబ్ధి పొందడానికి అమలు చేయడానికి ప్రజాపాలన కార్యక్రమం ద్వారా 6 గ్యారంటీల పథకాలతో అమలు చేయడానికి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంచి స్పందన వస్తుందని తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ల ఫోరం కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు నత్తి మల్లేష్ ముదిరాజ్ తెలిపారు.
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కలకల్ గ్రామంలో ప్రజా పాలన అభయ హస్తం గ్యారంటీల దరఖాస్తు స్వీకరణలో తెలంగాణ రాష్ట్ర సర్పంచుల పోరం కలకల్ గ్రామ సర్పంచ్ నత్తి మల్లేష్ ముదిరాజ్ పాల్గొని మాట్లాడుతూ
గ్రామంలో 1156 దరఖాస్తుల స్వీకరించడమైనదని, ఇంకా దరఖాస్తులు వస్తున్నాయని ప్రజా పాలన కార్యక్రమానికి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారని , ప్రజల నుండి మంచి స్పందన వస్తుందని అర్హులైన వారికి త్వరలోనే పథకాలు అందుతాయని మీడియాతో మాట్లాడుతూ తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి శ్రీ సాయన్న గారి నర్సింలు, మండల తాసిల్దార్ శ్రీనివాస్, మండల అభివృద్ధి అధికారి శ్రీ యాదగిరిరెడ్డి, ఇరిగేషన్ ఏఈ అనురాధ , ఐకెపి ఏపీఓ
పెంట గౌడ్, మండల తహసిల్దార్ కార్యాలయ సిబ్బంది, గ్రామపంచాయతీ సిబ్బంది వివిధ శాఖల అధికారులు, పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking