“తూప్రాన్ లో ఘనంగా క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే 193 వ జయంతి వేడుకలు”

 

మెదక్ తూప్రాన్ ప్రాజబలం న్యూస్ :-

మెదక్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం తూప్రాన్ లోని స్థానిక జెడ్పిజిహెచ్ఎస్ బాలికల పాఠశాల లో క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే 193 వ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు .ఈ సందర్భంగా మెదక్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు చిన్న లింగ్ మల్లికార్జున్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి ఫ్లోరెన్స్ గారిని సీనియర్ ఉపాధ్యాయురాలు శ్రీమతి లక్ష్మీ గారిని ఈ సందర్భంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం ఫ్లోరెన్స్ గారు, లక్ష్మీ గారు, విజయ్ కుమారి గారు ఉపాధ్యాయ బృందం బీసీ సంఘం నాయకులు గడ్డం వెంకట్, దుర్గిశివ, నాగరాజు యాదవ్, , బాలేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking