భారతీయ యోగా సంస్థాన్ మహిళా యోగ శక్తి దివస్

ప్రజాబలం ప్రతినిధి ఎం. జీ. పార్క్ యోగా సెంటర్ సభ్యులూ మరియు ఇంచార్జి ప్రదీప్ రావు ఆధ్వర్యంలో జరిగిన భారతీయ యోగా సంస్థాన్ మహిళా యోగ శక్తి దివస్ అల్కపూర్ టౌన్ షిప్ నేతాజీ పార్క్ నందు జరిగినది, జ్యోతి ప్రజ్వలనతో మొదలై, జీ. అనిత సరస్వతీ వందనంతో పాటు ప్రానాయణం, ధ్యానం యోగాసనాలు విచ్చేసిన ఎం జీ పార్క్ సభ్యులు, ల్యాంకో హిల్స్ సెంటర్ సభ్యులు, చిత్రపురి కాలనీ సెంటర్ సభ్యులు, నేతాజీ పార్క్ సెంటర్ సభ్యులు నిర్వహించినారు. తదుపరి ఎం. జీ. పార్క్ మహిళా సభ్యులు, నేతాజీ పార్క్ మహిళా సభ్యులచే యోగా డాన్స్ చేయడం జరిగినది.
అతిధి దేవోభవ డిస్ట్రిక్ట్ 1 సెక్రటరీ యుగంధర్ రావు మాట్లాడుతూ ఆధునిక కాలంలో భారతీయ యోగా సంస్థాన్ మహిళల పాత్ర విశిష్టతను తెలియపరుస్తూ, కుటుంబ సభ్యులకు, సహ కుటుంబీకులకు అనారోగ్య పరిస్తితులలో నివారణ నిమిత్తం మహిళల పాత్ర విశిష్టతను గురించి తెలియజేయడం జరిగినది, శ్రోతలకు హిందీలో మంజు అగర్వాల్, తెలుగులో సుగుణమ్మ తమ తమ కవితల ద్వారా విచ్చేసిన అతిథులను ఉర్రూత లూగించినారు. విచ్చేసిన అతిథులకు, కాలనీ వాసులకు ప్రసాద వితరణతో, ప్రదీప్ రావు ధన్యవాద ప్రస్తావనతో సభ ముగిసింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking