గడ్డం శ్రీనివాస్ యాదవ్ ను ఘనంగా సన్మానించిన భేరి రామచంద్ర యాదవ్, బిల్డర్ ప్రసాద్ యాదవ్,అందేలా కుమార్ యాదవ్
హైదరాబాద్ ప్రజాబలం ప్రతినిధి:హైదరాబాద్ డిస్ట్రిక్ట్ రెజ్లింగ్ అసోసియేషన్ చైర్మన్గా గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఎన్నికైన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన బిసి ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు భేరి రామచందర్ యాదవ్
రెజ్లింగ్ క్రీడాకారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హైదరాబాద్ డిస్ట్రిక్ట్ రెజ్లింగ్ అసోసియేషన్ చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ బషీర్ బాగ్ ఫతేమైదాన్ క్లబ్ లో గడ్డం శ్రీనివాస్ యాదవ్ ను అసోసియేషన్ నాయకులు అసోసియేషన్ ఛైర్మెన్ గా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను ఘనంగాసన్మానించారు. అనంతరం గడ్డం శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ… ప్రభుత్వ ఉద్యోగాల్లో రెజ్లింగ్ క్రీడాకారుల కోటాను నిషేదించారని… దానిని పునరుద్ధరించాలని కోరారు. రెజరర్లు శరీరకాంగ దృఢంగా ఉంటారని… పోలీస్ ఉద్యోగ నియామకాల్లో ప్రాధాన్యత కల్పించాలని అన్నారు. అలాగే రెజరర్లు పోటీలలో పాల్గొనడం వల్ల చదువుల్లో వెనుకబడుతున్నారని… అటెండెన్స్ లేని కారణంగా వారిని ఎగ్జామ్స్ రాయించడానికి కూడా అనుమతించడం లేదని తెలిపారు. వారికి అటెండెన్స్ లో మినహాయింపు ఇవ్వాలని… అలాగే యువ రెజరర్లకు ఉన్నత చదువులు చదవడానికి తన వంతు సహకారం అందిస్తామని గడ్డం శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.ఈ సందర్భంగా భేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ గడ్డం శ్రీనివాస్ యాదవ్ చాలా మంచి నాయకత్వం లక్షణాలున్న మనిషన్నారు. హైదరాబాద్ డిస్ట్రిక్ట్ రెజ్లింగ్ అసోసియేషన్ చైర్మన్గా నియమాతులైనందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచి పోరాటపటిమ గల వ్యక్తిని ఎన్నుకున్నారని ఆయన రెజ్లింగ్ క్రీడాకారుల పట్ల అంకితభావంతో పనిచేసి వారికి తగిన విధంగా కృషి చేస్తారని ఆశిస్తున్నానని అన్నారు గ్రామీణ స్థాయి నుండి క్రీడాకారులను ప్రోత్సహించాలి కుస్తీ పోటీ ఆసక్తి గల యువతి యువకులకు ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలి వారికి కోచింగ్ సమయంలో దాదాపు నెలకు వేలు ఖర్చు వస్తుంది ప్రభుత్వం పూర్తిగా మద్దతు తెలిపాలి కుస్తీ పోటీ క్రీడాకారులకు ప్రభుత్వం విద్యా ఉద్యోగ లో అవకాశాలు కల్పించాలి అని అన్నారు జిల్లాస్థాయి రాష్ట్రస్థాయి రాష్ట్రస్థాయి జాతీయస్థాయి లెవెల్లో ఈ క్రీడాన్ని ప్రభుత్వాలు ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో బిసి ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ రెజ్లింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బి సంతోష్ యాదవ్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శైలేంద్ర సింగ్, వైస్ ప్రెసిడెంట్ కిరణ్ యాదవ్,వైస్ చైర్మన్ షేక్ సలాం బిన్ అబ్దుల్లా, జనరల్ సెక్రటరీ నజీర్ కుల్లాకి, ట్రెజరర్ ఖాలెద్ బామస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ మహ్మద్ అస్లాం జాయింట్ సెక్రటరీ లింగం తదితరులు పాల్గొన్నారు.