హిమాయత్ నగర్ ఆదర్శ బస్తీలో పౌరసరఫరాల దుకాణం 602 లో లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేసిన హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్..
ఖైరాతాబాద్ ప్రజాబలం ప్రతినిధి: నారాయణ గూడ గాంధీ కుటీర్ వద్ద సన్న బియ్యం లబ్ధిదారుడు ఇంట్లో భోజనం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్,మేయర్ గద్వాల విజయ లక్ష్మీ ,కలెక్టర్ అనుదీప్ దురశెట్టి,కార్పొరేటర్లు మహా లక్ష్మి,విజయారెడ్డి
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ
భారతదేశంలో మొదటి సారి ధనవంతుడు పేదవాడు అనే తేడా లేకుండా సన్న బియ్యం తినాలని తెలంగాణ ప్రభుత్వం ఉగాది పండగ నుండి సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించింది.
హైదరాబాద్ లో ఎన్నికల కోడ్ వల్ల సన్న బియ్యం పంపిణీ చేయలేకపోయింది
ఈ నెల ఒకటో తేదీ నుండి 653 రేషన్ షాపులలో సన్న బియ్యం పంపిణీ ప్రారంభించింది
సన్న బియ్యం కార్యక్రమంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఈ బియ్యం పంపిణీ చేస్తున్నాం
అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం
10 సంవత్సరాలుగా రేషన్ కార్డులు ఇవ్వలేరు..మార్పులు చేయలేదు
తెలంగాణ ప్రభుత్వం కుల గణన సర్వే ,ప్రజా వాణి అప్లికేషన్ , రెగ్యులర్ గా ఎమ్మార్వో ఆఫీస్ ల నుండి వచ్చిన అప్లికేషన్ ల ద్వారా రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ జరుగుతుంది

ఇది చారిత్రాత్మక నిర్ణయం.. బయట 60 రూపాయలకు కేజీ బియ్యం ఉన్నాయి
ఈ పథకం ఎంతగానో ఉపయోగపడనుంది
తెలంగాణ ప్రభుత్వం 200 యూనిట్ల ఉచిత విద్యుత్ 500 కి గ్యాస్,సన్న వడ్లకు 500 బోనస్,60 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం
హైదరాబాద్ సమగ్ర అభివృద్ధిపై ముందుకు వెళ్తాం
హైదరాబాద్ ప్రజలు ఈ సన్న బియ్యం పథకాన్ని ఉపయోగించుకొని ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించగలరు..
ఇందిరమ్మ ఇళ్లు , రేషన్ కార్డులు ,
యువ వికాసం పథకం ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం..
నారాయణ గూడ గాంధీ కుటీర్ వద్ద సన్న బియ్యం లబ్ధిదారుడు ఇంట్లో స్థానిక ఎమ్మెల్యే, మేయర్, కార్పొరేటర్లు అధికారులతో కలిసి భోజనం చేయడం జరిగింది
సన్న బియ్యం లబ్ధిదారులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు..