👉 మినీ భార్లను తలపిస్తున్న బెల్ట్ షాపులు
👉 ఏరులై పారుతున్న అక్రమ మద్యం
👉 ఏటా మృత్యువాత పడుతున్న సామాన్య జనం
అందోల్ నియోజకవర్గం ప్రతినిధి మే 4 (ప్రజాబలం ) సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం లోని పలు మండలాల గ్రామాలలో ఉదయం 6 గంటలకే బెల్ట్ షాపులు దర్శనమిస్తున్నాయి. ఉదయం టీ కాపీలతో మొదలు పెట్టవలసిన దినచర్య ఉత్తర్ పెగ్గులతో మొదలు పెడుతున్నారు. రేవంత్ రెడ్డి. ప్రభుత్వం బెల్ట్ షాపులపై ఉక్కు పాదం మోపుతామన్న విషయాన్ని. ఎక్సైజ్ శాఖ. అధికారులు మరిచిపోయారా. లేక మామూళ్ల మత్తులో మునిగి పట్టించుకోకుండా వదిలేస్తున్నారా.అర్థం కాని పరిస్థితి, బెల్ట్ షాపు నిర్వాహకుడు. సైతం ఒక క్వార్టర్ కు పది రూపాయలు, అధికంగా కట్టి తీసుకొస్తున్నాం. ఏదైనా ఉంటే. ఎక్సైజ్ శాఖ అధికారులు. వైన్ షాప్ నిర్వాహకులు. చూసుకుంటారు. మాకేం భయం లేదు అన్నట్టు నిర్వహిస్తున్నారు. ప్రజలు పొద్దస్తమానం కష్టపడి సంపాదించిన సొమ్మును బెల్ట్ షాపులకు దారపోస్తున్నారు. దీంతో వారి కుటుంబాల్లో గొడవలు పడుతూ. కుటుంబ పోషణ భారమై ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇబ్బందులకు,గురవుతున్నారు, గ్రామాలలో బెల్ట్ షాపులు నడిపిస్తే బెల్ట్ షాపుల యజమానులపై అధికారులు ఏ ఒక్కరిపై చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. ఎందుకంటే బెల్ట్ షాపుల యజమానులు ఇటు పోలీసులకు. అటు ఎక్సైజ్ అధికారులకు. పెద్ద మొత్తంలో మామూళ్లు ఇస్తున్నారు అన్న ఆరోపణలు ఉన్నాయి, ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే బెల్ట్ షాపులపై దాడులు నిర్వహించి. తమ కుటుంబాలలో వెలుగులు నింపాలని,నియోజకవర్గంలోని, వివిధ మండలాల గ్రామాల ప్రజలు ముఖ్యంగా మహిళలు అధికారులను కోరుతున్నారు….