వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద పడి గాపులు కాస్తున్న రైతులు

 

👉 కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షించని సంబంధిత అధికారులు

అందోల్ నియోజకవర్గం ప్రతినిధి మే 4 (ప్రజాబలం ) సంగారెడ్డి జిల్లా ఉమ్మడి పుల్కల్ మండలంలోని ఆయా గ్రామాలలో ప్రారంభించిన వారి కొనుగోలు కేంద్రాలలో, రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను, ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకువస్తే, ధాన్యం కొనుగోలు నిర్వాహకులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం అని పలు గ్రామాల ప్రజలు అడుగుతున్నారు, తాము ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కాపాడుకోవడానికి నిద్రాహారాలు మాని కరెంటు ప్రాబ్లం వల్ల తమ పంట పొలంలోని బోరు బావుల వద్దనే ఉండి పంటను కాపాడుకున్నప్పటికీ వరి పైరు పొట్ట దశకు వచ్చేటప్పటికి మండుతున్న ఎండలకు భూగర్భ జలాలు అడుగంటిపోయి పంటలకు నీరు అందక ఉన్న దానిని కాపాడు కొన్న, పంట కోతకు వచ్చే దశలో, అకాల వర్షాలకు పంట నష్టపోయిన మిగిలి ఉన్న పైరును రైతులు వరి కోత యంత్రాల ద్వారా వరి పైరును కోఇంచి ధాన్యాన్ని ఆరబోసుకొని వరి కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకొని వస్తే, వారు సమయానికి తూకం వేయక వారి ఇష్ట రాజ్యంగా వ్యవహరిస్తున్నారని, రైతుల పట్ల ఏ ఒక్క అధికారి స్పందించిన పాపాన పోలేదని, రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు, ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మా సమస్యను పరిష్కరించి మేము ఆరబోసుకున్న ధాన్యాన్ని సమయానికి తూకం వేయించాలని, లేనియెడల భారీ మొత్తంలో రైతులమంత ఏకమై జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు, పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని వారు ఈ సందర్భంగా హెచ్చరించారు, దీనిపై వెంటనే సంబంధిత వ్యవసాయ అధికారులు స్పందించి, రైతులకు తగిన న్యాయం చేయాలని మండలంలోని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు..

Leave A Reply

Your email address will not be published.

Breaking